<font face="mangal" size="3">నివాసిత వ్యక్తుల కోసం సరళీకృత చెల్లింపు పథĵ - ఆర్బిఐ - Reserve Bank of India
నివాసిత వ్యక్తుల కోసం సరళీకృత చెల్లింపు పథకం (ఎల్ఆర్ఎస్) – లావాదేవీల రోజువారీ నివేదిక
ఆర్బిఐ/2017-18/161 ఏప్రిల్ 12, 2018 అన్ని కేటగిరి - I అధీకృత డీలర్ బ్యాంకులు మేడం / సర్ నివాసిత వ్యక్తుల కోసం సరళీకృత చెల్లింపు పథకం (ఎల్ఆర్ఎస్) – లావాదేవీల రోజువారీ నివేదిక దయచేసి ఏప్రిల్ 05, 2018 తేదీ మొదటి ద్వై మాసిక ద్రవ్య విధాన ప్రకటన 2018-19 యొక్క రెండవ భాగంలోని పేరాగ్రాఫ్ 10 లో చేసిన ప్రకటనను చూడండి. 2. ప్రస్తుతం, సరళీకృత చెల్లింపు పథకం (ఎల్ఆర్ఎస్) క్రింద లావాదేవీలు అధీకృత డీలర్లచే రేమిటర్ యొక్క వాంగ్మూలం ఆధారంగా అనుమతించబడుతున్నాయి. విశ్వసనీయ సమాచార అనుపస్థితి వలన, పరిమితి అనువర్తన యొక్క పర్యవేక్షణ అటువంటి స్వతంత్ర ధృవీకరణ లేని వాంగ్మూలానికే పరిమితమైనది. 3. పర్యవేక్షణను మెరుగుపరచడానికి మరియు ఎల్ఆర్ఎస్ పరిమితికి అనుగుణంగా ఉండేలా చేయడానికి, ఎల్ఆర్ఎస్ క్రింద వ్యక్తులచే నిర్వహించబడిన లావాదేవీలు, అధీకృత డీలర్ బ్యాంకుల ద్వారా రోజువారీ నివేదిక వ్యవస్థను ఉంచడానికి నిర్ణయించబడింది. ఇది అన్ని ఇతర అధీకృత డీలర్లకు అందుబాటులో ఉంటుంది. 4. ఆ ప్రకారం, ఈ సర్కులర్ తేదీ నుండి, ఎల్ఆర్ఎస్ క్రింద వచ్చే లావాదేవీల రోజువారీ సమాచారాన్ని అన్ని అధీకృత డీలర్ కేటగిరి-I బ్యాంకులు, తదుపరి పని దినం వ్యాపార వేళలు ముగిసే సమయానికి నివేదించాలి. ఎటువంటి సమాచారం లేనప్పుడు ‘శూన్య’ నివేదికను అధీకృత డీలర్ బ్యాంకులు అప్లోడ్ చేయాలి. ADR బ్యాంకులు LRS డేటా ను CSV ఫైల్ (కామాతో వేరు చేయబడినవి) గా URL ద్వారా XBRL సైట్ ను యాక్సెస్ చేయడం ద్వారా https://secweb.rbi.org.in/orfsxbrl/, ఇంతకు ముందులాగా అప్లోడ్ చేయవచ్చు. 5. ఈ సర్కులర్లో ఉన్న ఆదేశాలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణచట్టం, 1999 (ఫారిన్ ఎక్స్చేంజి మానేజిమెంట్ ఆక్ట్) (42 ఆఫ్ 1999) యొక్క సెక్షన్ 10 (4) మరియు 11 (1) క్రింద, ఏ ఇతర చట్టాల క్రింద ఇచ్చిన అనుమతులు/ఆమోదాలకు విరుద్ధముగా కాకుండా, జారీ చేయబడ్డాయి. మీ విధేయులు, (ఆర్.కె.మూలచందాని) |