<font face="mangal" size="3px">మహోబా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మహోబా, (యు.పĹ - ఆర్బిఐ - Reserve Bank of India
మహోబా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మహోబా, (యు.పి.) - జరిమానా విధించబడింది
మార్చ్ 06, 2019 మహోబా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మహోబా, (యు.పి.) - జరిమానా విధించబడింది బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఇంటర్-బ్యాంక్ స్థూల మరియు కౌంటర్ పార్టీ పరిమితి ప్రూడెన్షియల్ నిబంధనల ఫై భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, మహోబా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మహోబా, (యు.పి.) ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 50,000/- (యాభై వేల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖిత పూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/2117 |