<font face="mangal" size="3">పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగĺ - ఆర్బిఐ - Reserve Bank of India
పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ-MSF) – సడలింపుల యొక్క పొడిగింపు
సెప్టెంబర్ 28, 2020 పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ-MSF) – సడలింపుల యొక్క పొడిగింపు పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ-MSF) క్రింద నిధులను పొందడానికి చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (యస్ యల్ ఆర్-SLR) నిదులలోంచి యన్ డి టి యల్ (Net Demand and Time Liabilities) అదనంగా ఒక శాతం వరకు, అంటే మొత్తం యన్డిటియల్ లో మూడు (3) శాతం వరకు నిధులను వినియోగించుకోవడానికి మార్చి 27, 2020 న బ్యాంకులు అనుమతించబడినవి. కోవిడ్-19 అంతరాయాల దృష్ట్యా, ముందు జూన్ 3, 2020 వరకు అనుమతించబడిన ఈ సౌకర్యం, తేదీ జూన్ 26, 2020 నాటి ఆదేశం ద్వారా సెప్టెంబర్ 30, 2020 వరకు అనుమతించబడింది. ఈ సౌకర్యం ₹ 1.49 లక్షలకోట్ల మేరకు నిధులు అందుబాటులో ఉంచడమే గాకుండా లిక్విడిటీ కవేరేజ్ రేషియో (యల్ సీ ఆర్ – LCR) కోసం ఉన్నత-శ్రేణి ద్రవ్య ఆస్తులు (హెచ్ క్యూ యల్ ఎ – HQLA) గా అర్హత పొందుతుంది. యల్ సీ ఆర్ – LCR అవసరాల తీర్పు కొనసాగింపుకు వీలుగా బ్యాంకులకు ద్రవ్య లభ్యత అందించే ఉద్దేశ్యం తో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ-MSF సడలింపును మరో ఆరు మాసాల పాటు అనగా మార్చి 31, 2021 వరకు కొనసాగించాలని నిర్ణయించడమైనది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2020-2021/401 |