<font face="mangal" size="3">ప్రజలకు వినియోగదారుని సేవను అందించడం లో పని - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రజలకు వినియోగదారుని సేవను అందించడం లో పనితీరు ఆధారంగా మాస్టర్ డైరెక్షన్ - కరెన్సీ పంపిణీ మరియు మార్పిడి పథకం సమీక్ష (CDES)
ఆర్బిఐ/DCM/2016-17/36 జూలై 20, 2016 అధ్యక్షుడు & నిర్వాహక సంచాలకులు/ మేడం / డియర్ సర్, ప్రజలకు వినియోగదారుని సేవను అందించడం లో పనితీరు ఆధారంగా భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45 మరియు ప్రవేశిక మరియు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35A ప్రకారం, మా శుభ్రమైన నోట్ల విధానం (క్లీన్ నోట్ పాలసీ) యొక్క లక్ష్యాలను అమలు సాధనకు రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు/సూచనలు జారీచేస్తుంది. ఈ లక్ష్యాలను కొనసాగించడానికి, అన్ని బ్యాంకు శాఖలు ప్రజా సభ్యులకు మెరుగైన వినియోగదారు సేవలను అందించేలా చేయడానికి కరెన్సీ పంపిణీ మరియు మార్పిడి పథకం సమీక్ష (CDES) పేరుతో ప్రోత్సాహకాల పథకాన్ని రూపొందించింది. 2. జతపర్చిన మాస్టర్ డైరెక్షన్ ఈ అంశంపై నవీకరించబడిన మార్గదర్శకాలు/సర్కులర్లను కలిగి వుంది. కాలానుసారంగా తాజా సూచనలను జారీచేసినప్పుడు, ఎప్పటికప్పుడు అవి మాస్టర్ డైరెక్షన్ లో నవీకరించబడతాయి. 3. ఈ మాస్టర్ డైరెక్షన్ రిజర్వు బ్యాంకు వెబ్ సైట్ www.rbi.org.in. లో ఉంచబడింది. మీ విధేయులు, (పి.విజయ కుమార్) జతచేసినది: పైన పేర్కొన్న విధంగా 1. పరిచయం - అన్ని బ్యాంక్ బ్రాంచీలు శుభ్రమైన నోట్ల విధానం (క్లీన్ నోట్ పాలసీ) యొక్క లక్ష్యాలతో, నోట్లు మరియు నాణేల మార్పిడికి సంబంధించి ప్రజలందరికీ మెరుగైన వినియోగదారు సేవలను అందించేలా చేయడానికి, కరెన్సీ చెస్ట్ లతో సహా బ్యాంకు శాఖల కోసం కరెన్సీ పంపిణీ మరియు మార్పిడి పథకం (CDES) ఉద్దేశించబడింది. 2. ప్రోత్సాహకాలు పథకం ప్రకారం, నోట్లు మరియు నాణేల మార్పిడి సదుపాయాలను అందించడానికి, బ్యాంకులు క్రింది ఆర్థిక ప్రోత్సాహకాల కోసం అర్హులు:
3. ప్రోత్సాహకాలు పొందేందుకు కార్యాచరణ మార్గదర్శకాలు - 3.1 పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు - i) ఆర్బిఐ యొక్క జారీ కార్యాలయంలో వాస్తవంగా స్వీకరించబడిన చిరిగిపోయిన నోట్లపై ప్రోత్సాహకాలు చెల్లించబడతాయి. ఈ విషయంలో బ్యాంకులు వేరొక క్లైమును సమర్పించాల్సిన అవసరం లేదు. కరెన్సీ చెస్ట్ శాఖ ప్రో-రేటా ప్రాతిపదికన వారిచే ఇవ్వబడిన సాయిల్డ్ నోట్లకు లింక్ శాఖలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి ii) అదేవిధంగా, ఆర్బిఐకి సీల్డ్ కవర్లో రిజిస్టర్డ్/ బీమా పోస్టు ద్వారా ప్రత్యేకంగా పంపిన నోట్లు/ పరీక్షించి విలువ చెల్లించబడిన నోట్లు పాత నోట్లతో పంపినప్పుడు, ప్రోత్సాహకం చెల్లించబడుతుంది. ఈ విషయంలో బ్యాంకులు వేరొక క్లైమును సమర్పించాల్సిన అవసరం లేదు. 3.2 యంత్రాల సంస్థాపనకు ప్రోత్సాహకాలు i) జూలై 01 నుండి జూన్ 30 వరకు కాలంలో కరెన్సీ చెస్ట్ ప్రారంభించడం, పలు యంత్రాలను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన బ్యాంకులు, సంబంధిత సంవత్సరం ఏప్రిల్ 15 నాటికీ జారీ కార్యాలయాలకు, యంత్రాల వివరాలను మరియు ఖర్చులను కలిగి ఉన్న వారి వార్షిక ప్రణాళికను సమర్పించవచ్చు. ప్రణాళికలను అందుకున్నప్పుడు, ఆ సంవత్సరానికి ప్రతి బ్యాంకుకి అనుమతించిన గరిష్ట మొత్తాన్ని, జారీ కార్యాలయాలు సూచించవచ్చు. ii) క్యాష్ రీసైక్లర్లు మరియు తక్కువ విలువ కలిగిన నోట్లను అందించే ATM లు (అంటే, రూ.100 విలువ వరకు) సంస్థాపన జరిపినప్పుడు, అట్టి సమాచారాన్ని ప్రోత్సాహకాల కోసం త్రైమాసిక ప్రాతిపదికన, ఆర్బిఐ యొక్క సంబంధిత జారీ కార్యాలయాలకు, త్రైమాసికం ముగిసిన 30 రోజులలో బ్యాంకు యొక్క లింక్ ఆఫీసు ద్వారా సమర్పించాలి. ఏదేమైనా ఇటువంటి క్లైములు యంత్రాలు కోసం విక్రేతలకు పూర్తి చెల్లింపు చేసిన తర్వాత మాత్రమే సమర్పించాలి. |