<font face="mangal" size="3">ద్రవ్య విధాన ప్రకటన, 2020-21 ద్రవ్య విధాన కమిటీ తీర - ఆర్బిఐ - Reserve Bank of India
ద్రవ్య విధాన ప్రకటన, 2020-21 ద్రవ్య విధాన కమిటీ తీర్మానం (MPC) ఫిబ్రవరి 3-5, 2021
ఫిబ్రవరి 05, 2021 ద్రవ్య విధాన ప్రకటన, 2020-21 ద్రవ్య విధాన కమిటీ తీర్మానం (MPC) ఫిబ్రవరి 3-5, 2021 నేటి (ఫిబ్రవరి 05, 2021) సమావేశంలో, ప్రస్తుత మరియు మార్పు చెందుతున్న స్థూల ఆర్దిక పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ద్రవ్య విధాన కమిటీ (MPC) ఈ విధంగా నిర్ణయించింది:
పర్యవసానంగా, రివెర్స్ రెపో రేట్ LAF కింద 3.35 శాతంగా; మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) మరియు బ్యాంకు రేట్లు 4.25 శాతం గా కొనసాగుతాయి.
MPC యొక్క నిర్ణయం, ఒకవైపున అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, వినియోగదారుల ధరల సూచీ (CPI) విషయంలో, +/- 2 శాతం బ్యాండ్ లో 4 శాతం ద్రవ్యోల్బణం మధ్యకాలిక ధ్యేయాన్నిసాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా వుంది. ఈ నిర్ణయం తీసుకోవడoలోని ముఖ్య కారణాలను ఈ క్రింది ప్రకటనలో పొందుపరచడం జరిగింది: అంచనాలు అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ 2. మూడవ త్రైమాసికంతో (జులై-సెప్టెంబర్) పోలిస్తే నాల్గవ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) 2020 లో ప్రపంచ ఆర్ధిక పరంగా, రికవరీ మందగించింది, ఎందుకంటే అనేక దేశాలు COVID-19 ఇన్ఫెక్షన్ల సెకండ్ వేవ్ తో, ముఖ్యంగా అత్యంత తీవ్రమైన స్టెయిన్ తో పోరాడుతున్నాయి. టీకా పంపిణికి భారీగా ఏర్పాట్లు చేయడంతో, రికవరీ కి ఉన్ననష్టభయాలు తొలగిపోతాయి మరియు 2021 రెండవ అర్ధ భాగంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. తన జనవరి 2021 అప్డేట్ లో, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 2020 లో ప్రపంచ వృద్ధి అంచనా ను (-) 4.4 శాతం నుండి (-) 3.5 శాతానికి పైకి సవరించింది మరియు 2021 సంవత్సరానికి ప్రపంచ వృద్ధి అంచనా ను 30 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి సవరించింది. కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలను మినహాయిస్తే, గిరాకీ మొత్తం లో మందగింపు వల్ల ద్రవ్యోల్బణం అదుపులోఉంది, అయినప్పటికీ పెరుగుతున్న వస్తువుల ధరలు నష్టభయాన్ని ఎగదోస్తున్నాయి. ఈజీ ద్రవ్య పరిస్థితులు, సమృద్ధిగా ద్రవ్యత మరియు టీకా పంపిణికి విస్తృత ఏర్పాట్ల మద్దతుతో ఫైనాన్షియల్ మార్కెట్లు ఉత్సాహంగా ఉన్నాయి. వాణిజ్యం కంటే సేవలలో రికవరీ నెమ్మదిగా ఉన్నప్పటికీ 2021 లో గ్లోబల్ ట్రేడ్ కూడా పుంజుకుంటుందని అంచనా. దేశీయ ఆర్ధిక వ్యవస్థ 3. జనవరి 7, 2021 న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన 2020-21 సంవత్సరానికి జిడిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం, రియల్ జీడీపీ 7.7 కు సంకోచించింది, ఇది డిసెంబర్ 2020 MPC తీర్మానం (-) 7.5 శాతం ప్రొజెక్షన్‌కు అనుగుణంగా ఉంది. హై-ఫ్రీక్వెన్సీ గణాంకాలు - రైల్వే సరుకు రవాణా; టోల్ సేకరణ; ఇ-వే బిల్లులు; మరియు ఉక్కు వినియోగం - మూడవ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో సేవల రంగంలోని కొన్ని విభాగాలు పురోగతిని సూచిస్తున్నాయి. వ్యవసాయ రంగం స్థితి స్థిరంగా ఉంది - ఈశాన్య రుతుపవనాల అధిక వర్షపాతం మరియు తగిన రిజర్వాయర్ స్థాయి పూర్తి సామర్థ్యం లో 61 శాతం (ఫిబ్రవరి 4, 2021 నాటికి) (ఇది గత పదేళ్ల సగటు 50 శాతంకు పైన)నిండడం, వీటి మద్దతుతో జనవరి 29, 2021 నాటికి రబీ లో సాగు ఏటికేడాదీ (వై-ఓ-వై) 2.9 శాతం అధికం. 4. వరుసగా ఆరు నెలలు (జూన్-నవంబర్ 2020) గా టాలరెన్స్ లిమిట్ 6 శాతానికి ఎగువగానే ఉన్నా; ఆహార ధరలు తగ్గిపోవడం మరియు అనుకూలమైన బేస్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో సిపిఐ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 4.6 శాతానికి పడిపోయింది. మునుపటి మూడు నెలల్లో (సెప్టెంబర్-నవంబర్) సగటున 9.6 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం డిసెంబరులో 3.9 శాతానికి పడిపోయింది; కారణం కూరగాయల ధరలలో గణనీయమైన దిద్దుబాటు మరియు ఖరీఫ్ పంట రాకతో తృణధాన్యాలు ధరలను సరళతరం చేయడం, సరఫరా పరంగా జోక్యాలు కొనసాగడం తో. మరోవైపు, కోర్ -ద్రవ్యోల్బణం, అనగా ఆహారం మరియు ఇంధనాన్ని మినహాయించి సిపిఐ ద్రవ్యోల్బణం డిసెంబరులో 5.5 శాతానికి పెరిగింది. రిజర్వు బ్యాంకు వారి జనవరి 2021 విడత సర్వేలో, మూడు నెలల ముందస్తు కుటుంబ ద్రవ్యోల్బణం అంచనాలు రాబోయే మూడు నెలల్లో ద్రవ్యోల్బణం మరింత బలహీనపడుతుందని చెబుతున్నాయి. ఇది ఆహార ద్రవ్యోల్బణం దిద్దుబాట్ల తో సరితూగుతుంది, అయితే ఏడాది ముందస్తు కుటుంబ ద్రవ్యోల్బణం అంచనాలలో ఎటువంటి మార్పులేదు. 5. ఈజీ ఫైనాన్షియల్ కండిషన్స్ కారణంగా, వ్యవస్థ లో లిక్విడిటీ డిసెంబర్ 2020 మరియు జనవరి 2021 లో బాగా మిగులయ్యింది. కరెన్సీ డిమాండ్ మూలంగా రిజర్వ్ మనీ ఏటికేడాదీ (వై-ఓ-వై) (జనవరి 29, 2021 న) 14.5 శాతం పెరిగింది. మరోవైపు, జనవరి 15, 2021 నాటికి మనీ సప్లై (ఎం 3) కేవలం 12.5 శాతం మాత్రమే పెరిగింది, కాని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ఆహారేతర క్రెడిట్ వృద్ధి 6.4 శాతానికి పెరిగింది. 2020 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ` 5.8 లక్షల కోట్ల కార్పొరేట్ బాండ్ల జారీ, గత ఏడాది ఇదే కాలంలో` 4.6 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంది. జనవరి 29, 2021 నాటికి భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 590.2 బిలియన్ US డాలర్లు గా ఉన్నాయి, మార్చి-చివర, 2020 నిల్వ మీద 112.4 బిలియన్ US డాలర్ల పెరుగుదల. దృక్పథం (ఔట్లుక్) 6. డిసెంబరులో కూరగాయల ధరలలో అంచనాను మించిన ప్రతి ద్రవ్యోల్బణం హెడ్-లైన్ ను లక్ష్యానికి దగ్గరగా క్రిందికి దింపుతున్నది. ఆహార ద్రవ్యోల్బణ పథం సమీపకాల దృక్పథo రూపును అందిస్తుంది. ఖరీఫ్ పంట భారీగా మార్కెట్లకు రావడం , రబీలో మంచిపంట వచ్చే అవకాశాలు, కీలకమైన కూరగాయలు శీతాకాలంలో అధికంగా రావడం మరియు గ్రుడ్డు మరియు పౌల్ట్రీ గిరాకీ ఏవియన్ ఫ్లూ భయంతో మృదువుగా అవడం రాబోయే మాసాల్లో సానుకూల ద్రవ్యోల్బణ ఫలితాన్ని పెంచే అంశాలు. మరోవైపు, పప్పుధాన్యాలు, వంటనూనెలు, సుగంధ ద్రవ్యాలు మరియు శీతల పానీయాలకు సంబంధించి ధరల ఒత్తిడి కొనసాగుతుంది. సరఫరా నిబంధనలను మరింత సడలించడం ద్వారా కోర్ ద్రవ్యోల్బణ దృక్పథం బాగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది; అయితే, పరిశ్రమల్లో ముడి పదార్ధాల ధరల పెరుగుదల కారణంగా సేవలు మరియు ఉత్పాదక ఖర్చులు ఎగిసి ధరలపై తగు ఒత్తిళ్లను కల్గించవచ్చు. ఇంకా, రిజర్వ్ బ్యాంక్ యొక్క పారిశ్రామిక దృక్పథం, సేవలు మరియు మౌలిక సదుపాయాల దృక్పథ సర్వేలు మరియు కొనుగోలు నిర్వాహకుల సూచికలు (పిఎంఐలు) మరియు సంస్థలు తిరిగి ధరల నిర్ధాయక శక్తిని పొందడం’ ఇవన్నీఉత్పాదకత ధరలు పెరిగే అవకాశాన్ని వ్యకపరస్తున్నాయి. టీకాకరణ మరియు ఒపెక్ ప్లస్ నిరంతరo ఉత్పత్తి కోతలను పెంచడం అంతర్జాతీయ ముడి చమురు ధరల గిరాకీ కి మద్దతు ఇవ్వవచ్చు. ముడి చమురు ఫ్యూచర్స్ కర్వ్ డిసెంబర్ 2020 నుండి క్రిందికి వాలుగా జారుతున్నది. పైన పేర్కొన్న కారకాలు పరిగణనలోకి తీసుకుని సిపిఐ (CPI) ద్రవ్యోల్బణం అంచనా త్రైమాసికం-4: 2020-21 కి 5.2 శాతం, ప్రధమార్ధభాగం: 2021-22 కి 5.2 నుండి 5.00 శాతం, త్రైమాసికం-3: 2021-22 కి 4.3 శాతం గా, సమతౌల్యమైన నష్టభయంతో, సవరించబడింది (చార్ట్-1). 7. ఇక వృద్ధి యొక్క దృక్పథం వైపుకు మళ్ళితే, వ్యవసాయంలో మంచి ఫలితాల మూలంగా గ్రామీణ గిరాకీ పెరుగుతుంది. COVID-19 కేసులు గణనీయoగా తగ్గిపోవడం మరియు వ్యాక్సినేషణ్ అమలు పట్టణ గిరాకీని మరియు కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవల గిరాకీని బలపరుస్తుందని భావిస్తున్నారు. వినియోగదారుల విశ్వాసం పుంజుకుంటుంది మరియు తయారీ, సేవలు మరియు మౌలిక సదుపాయాల యొక్క వ్యాపార అంచనాలు ఉత్సాహంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆత్మ నిర్భర్ 2.0 మరియు 3.0 పథకాల కింద ఆర్థిక ఉద్దీపన ప్రభుత్వ పెట్టుబడులను వేగవంతం చేస్తుంది, అయినప్పటికీ కెపాసిటీ వినియోగం తగ్గడం వల్ల ప్రైవేట్ పెట్టుబడులు మందగించాయి. ఆరోగ్యం మరియు శ్రేయస్సు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు మరియు పరిశోధన వంటి రంగాలపై కేంద్ర బడ్జెట్ 2021-22, వృద్ధి వేగాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రియల్ జిడిపి వృద్ధి 2021-22లో 10.5 శాతంగా అంచనా వేయబడింది – ప్రధమార్ధం 1 లో 26.2 నుండి 8.3 శాతం పరిధిలో మరియు త్రైమాసికం-3 లో 6.0 శాతం (చార్ట్ 2). 8. ఆహార ధరలలో చురుకైన దిద్దుబాటు ఆహార ధరల దృక్పథాన్ని మెరుగుపరిచిందని ఎంపిసి పేర్కొంది, అయితే కొన్ని ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి, అయితే కోర్ ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. డీజిల్ మరియు పెట్రోల్ పంపుల్లో ధరలు చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం మరియు రాష్ట్రాలు పన్నులు విరమించుకున్నట్లయితే ఎగిసే ధరలపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో అవసరం ఏమిటంటే డ్యూరబుల్ డిస్సిన్ఫ్లేషణ్ కారణమయ్యే పరిస్థితులను కల్పించడం. సరఫరా వైపు చేసే క్రియాశీలక చర్యలపై కూడా, తప్పనిసరి అవుతుంది. వృద్ధి కోలుకుంటుంది మరియు దేశంలో టీకా కార్యక్రమం ప్రారంభించడంతో దృక్పథం గణనీయంగా మెరుగుపడింది. కేంద్ర బడ్జెట్ 2021-22 వృద్ధికి ప్రేరణనిచ్చేందుకు అనేక చర్యలను ప్రవేశపెట్టింది. క్యాపిటల్ వ్యయం పెంపుదల అంచనా కెపాసిటీ సృష్టించడానికి బాగా ఉపయోగపడుతుంది, తద్వారా వృద్ధి మరియు వ్యయాల నాణ్యత పై విశ్వసనీయతను పెంపొందించే అవకాశాలను మెరుగుపరుస్తుంది. అయితే, రికవరీ ఇంకా బలంగా నిలదొక్కుకోవాల్సి ఉంది. ఈ నేపధ్యంలో నిరంతర విధాన మద్దతు చాలా అవసరం. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని, ఎంపిసి ఈనాటి తన సమావేశంలో రికవరీ స్థిరంగా నిలదోక్కుకునేంత వరకు వృద్ధి కి ఊతం ఇస్తూ ద్రవ్యోల్బణం దృక్పథాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూ ద్రవ్య విధానం సర్దుబాటు ధోరణి నే కొనసాగించాలని నిర్ణయించింది. 9. MPC సభ్యులందరూ - డాక్టర్ శశాంక భిడే, డాక్టర్ అషిమా గోయల్, ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మ, డాక్టర్ మృదుల్ కె. సగ్గార్, డాక్టర్ మైఖేల్ దేబబ్రతా పాత్రా మరియు శ్రీ శక్తికాంత దాస్ – పాలసీ రెపో రేటును 4 శాతం వద్ద మార్చకుండా ఉండటానికి ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఇంకా, రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న టార్గెట్ లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 ప్రభావo నుండి ఉపశమనం తో పాటు, నిలకడతో వృద్ధి ని పునరుద్ధరించడం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను, మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అవసరమైనంతమేరకు సర్దుబాటు ధోరణినే కొనసాగించాలని ఓటు వేశారు. 10. MPC యొక్క వివరాల టిప్పణి (మినిట్స్) ను ఫిబ్రవరి 22, 2021 లోగా ప్రచురించడం జరుగుతుంది. 11. ఎంపిసి తదుపరి సమావేశం ఏప్రిల్ 5 నుండి 7, 2021 వరకు జరుగుతుంది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2020-2021/1050 |