<font face="mangal" size="3">ద్రవ్య విధాన ప్రకటన, 2020-21 ద్రవ్య విధాన కమిటీ తీర - ఆర్బిఐ - Reserve Bank of India
ద్రవ్య విధాన ప్రకటన, 2020-21 ద్రవ్య విధాన కమిటీ తీర్మానం (MPC) అక్టోబర్ 7-9, 2020
అక్టోబర్ 09, 2020 ద్రవ్య విధాన ప్రకటన, 2020-21 నేటి (అక్టోబర్ 09, 2020) సమావేశంలో, ప్రస్తుత మరియు మార్పు చెందుతున్న స్థూల ఆర్దిక పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ద్రవ్య విధాన కమిటీ (MPC) ఈ విధంగా నిర్ణయించింది:
పర్యవసానంగా, రివెర్స్ రెపో రేట్ LAF కింద 3.35 శాతంగా; మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) మరియు బ్యాంకు రేట్లు 4.25 శాతం వద్ద ఉన్నాయి.
MPC యొక్క నిర్ణయం, ఒకవైపున అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, వినియోగదారుల ధరల సూచీ (CPI) విషయంలో, +/- 2 శాతం బ్యాండ్ లో 4 శాతం ద్రవ్యోల్బణం మధ్యకాలిక ధ్యేయాన్నిసాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా వుంది. ఈ నిర్ణయం తీసుకోవడoలోని ముఖ్య కారణాలను ఈ క్రింది ప్రకటనలో పొందుపరచడం జరిగింది: అంచనాలు అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ 2. లభ్యమవుతున్న డేటా 2020 త్రైమాసికంలో అంతర్జాతీయ ఆర్ధిక కార్యకలాపాల క్రమానుగత రికవరీ ను సూచిస్తున్నప్పటికీ అనేక దేశాలలో పైకెగుస్తున్న ఇన్ఫెక్షన్ల వల్ల ప్రతికూల ప్రమాదాలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్యం స్తబ్దుగానే ఉంటుందని భావిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థల (EME లు) కంటే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు (AE లు) బాగా పుంజుకోవచ్చు. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లు, మెరుగైన సర్దుబాటు ద్రవ్య విధానం మరియు ద్రవ్యత్వ పరిస్థితి మద్దతుతో నడుస్తున్నాయి. కొన్నిEME లలో సరఫరాల్లో అంతరాయాలు ధరల ఒత్తిడిని పెంచుతున్నప్పటికి, ఇంధన ధరలలో సరళత మరియు గిరాకీ మొత్తం లో మందగింపు AE లలో ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం లోపుగానే ఉంచాయి. దేశీయ ఆర్ధిక వ్యవస్థ 3. మన దేశం విషయానికి వస్తే, త్రైమాసికం-1 (ఏప్రిల్-జూన్) లో రియల్ జిడిపి ఏటికేడాదీ (వై-ఓ-వై) 23.9 శాతం క్షీణించిన తరువాత, త్రైమాసికం-2 2020-21లో ఆర్థిక కార్యకలాపాలు నిలదొక్కుకున్నాయని హై-ఫ్రీక్వెన్సీ గణాంకాలు సూచిస్తున్నాయి. గ్రామీణ గిరాకీ మరియు ప్రభుత్వ వ్యయం మూలంగా – ముఖ్యంగా కన్స్యూమర్ నాన్-డ్యూరబుల్స్ - ఇంకా ప్రయాణ వాహనాలు మరియు రైల్వే సరుకు రవాణా వంటి కొన్నికేటగిరి సేవలు క్రమంగా త్రైమాసికం-2 లో కోలుకున్నాయి. వ్యవసాయం యొక్క తీరు ద్రుడవంతంగా ఉంది. తయారీ రంగం వస్తువుల ఎగుమతులు నెమ్మదిగా COVID పూర్వ స్థాయిలకు చేరుకోవడం మరియు దిగుమతుల క్షీణవేగత కొంత మితంగా ఉండటంతో, వాణిజ్య లోటు త్రైమాసికం-2 లో క్రమానుగతంగా పెరిగింది. 4. జూలై-ఆగస్టు 2020 లో హెడ్‌లైన్ సిపిఐ ద్రవ్యోల్బణం 6.7 శాతానికి పెరిగింది, ఎందుకంటే ఆహార విభాగం, ఇంధనం తదితర ప్రధాన రంగాల సరఫరాల్లో అంతరాయం, పెరిగిన మార్జిన్లు ఇంకా పన్నులు పెరగడంతో ఒత్తిళ్ళు పెరిగాయి. ఏడాది ముందస్తు కుటుంబ ద్రవ్యోల్బణం అంచనాలు రాబోయే మూడు నెలల్లో ద్రవ్యోల్బణం కొంత బలహీనపడుతుందని చెబుతున్నాయి. సంస్థల అమ్మకాల ధరలలో కదలిక లేకపోవడం, గిరాకి క్షీణత ను ప్రతిబింబిస్తున్నది. 5. వ్యవస్థ లో లిక్విడిటీ అధికమవ్వడంతో, దేశీయ ఆర్ధిక స్థితిగతులు చెప్పుకోదగ్గరీతిలో గుబాళించాయి. కరెన్సీ డిమాండ్ (21.5 శాతం) పైకి పాకడం తో, రిజర్వు మనీ ఏటికేడాది (అక్టోబర్ 2, 2020 నాటికి) 13.5 శాతం పెరిగింది. అయితే, సెప్టెంబర్ 25, 2020 నాటికి మనీ సప్లై (ఎం 3) లో వృద్ధి 12.2 శాతంవద్ద కట్టడి చేయబడింది. బ్యాంకుల ఆహారేతర రుణాలలో వృద్ధి తగ్గుతూనే ఉంది. అక్టోబర్ 2, 2020 నాటికి భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 545.6 బిలియన్ డాలర్లు గా ఉన్నాయి. దృక్పథం (ఔట్లుక్) 6. ఇక ద్రవ్యోల్బణం యొక్క దృక్పథం వైపుకు మళ్ళితే, ఖరీఫ్ లో జరిగిన నాట్లు ధాన్యం ధరలకు మేలును సూచిస్తున్నాయి. టమోటాలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు వంటి కీలకమైన కూరగాయల ధరలపై ఒత్తిడి త్రైమాసికం-3 లో ఖరీఫ్ రాకతో సద్దుమణుగుతుంది. మరోవైపు, దిగుమతి సుంకాల ఎదుగుదల వల్ల పప్పుధాన్యాలు మరియు నూనెగింజల ధరలు దృడంగా ఉండే అవకాశం ఉంది. బలహీన గిరాకి ఔట్లుక్ వల్ల, సెప్టెంబర్లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుముఖం గా ట్రేడ్ అయ్యాయి. అయితే పన్నుల్లో రోల్-బ్యాక్ లేమి కారణంగా, దేశీయంగా పెట్రోలు బంకుల్లో ధరలు పెరగవచ్చు. గిరాకి తగ్గుముఖం నేపధ్యంలో, సంస్థల యొక్క ధరల నిర్ధాయక శక్తి బలహీనమౌతుంది. కార్మికుల కొరత మరియు రవాణా ఖర్చులు పెరగడం లాంటి COVID-19 సంబంధితమైన సరఫరా ఒడుదుడుకులు ఎగిసేధరలపై తగు ఒత్తిళ్లను కల్గించవచ్చు, అయితే క్రమేపి లాక్డౌన్లను సడలించడం మరియు అంతర్-రాష్ట్ర కదలికలపై పరిమితులను తొలగించడం ద్వారా ఈ నష్టభయాలు కొంతవరకు తగ్గించబడతాయి. పైన పేర్కొన్న కారకాలు పరిగణనలోకి తీసుకుని సిపిఐ (CPI) ద్రవ్యోల్బణం త్రైమాసికం-2: 2020-21 కి 6.8 శాతం, రెండో అర్ధభాగం: 2020-21 కి 5.4-4.5 శాతం, త్రైమాసికం-1: 2021-22 కి 4.3 శాతం గా, సమతౌల్యమైన నష్టభయంతో, అంచనా వేయబడింది (చార్ట్-1). 7. ఇక వృద్ధి యొక్క దృక్పథం వైపుకు మళ్ళితే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోలుకొని మరింత బలపడుతుందని, సామాజిక దూరo పాటింపు నిబంధనలు మరియు COVID-19 ఇన్ఫెక్షన్ నంబర్ల విస్తరణ వల్ల పట్టణాల్లో గిరాకి మందగించే అవకాశం ఉంది. కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవల రంగం కోవిడ్ పూర్వ స్థాయిని తిరిగిచేరడానికి సమయం పడుతుoటే, తయారీ రంగంలో త్రైమాసికం-3: 2020-21 లో సంస్థలు వారి సామర్ధ్యవినియోగం కోలుకుంటుందని మరియు త్రైమాసికం-4 నుండి కార్యకలాపాలు గాడిలోపడడం మెరుగవుతుందని ఆశిస్తున్నాయి. ముఖ్యంగా బయటినుండి గిరాకీ ఇంకా బలహీనంగానే ఉండడంతో ప్రైవేట్ పెట్టుబడులు మరియు ఎగుమతులు రెండూకూడా స్తబ్దత తో ఉండే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారకాలు మరియు COVID-19 ట్రాజేక్టరీ అనిశ్చితస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, 2020-21 సంవత్సరం రియల్ జిడిపి లో వృద్ధి, నష్టభయం తరిగే దిశ వైపుగా, (-) 9.5 శాతం వద్ద ప్రతికూలంగా ఉంటుందని అంచనా వేయబడింది: త్రైమాసికం-2 2020-21 లో(-)9.8 శాతం; త్రైమాసికం-3 లో (-)5.6 శాతం; మరియు త్రైమాసికం-4 లో 0.5 శాతం. త్రైమాసికం-1: 2021-22 లో రియల్ జిడిపి లో వృద్ధి 20.6 శాతం (చార్ట్ 2) వద్ద ఉంచబడింది (చార్ట్-2). ![]() 8. మునుపెన్నడూలేనివిధంగా COVID-19 మహమ్మారి బారిన పడిన ఆర్ధిక వ్యవస్థ కు పునరుత్తేజం ను కల్గించడమే, ద్రవ్య విధానo నిర్వహణలో ముఖ్య భూమిక వహిస్తుందని MPC అభిప్రాయపడింది. కొన్నినెలల తరబడి ద్రవ్యోల్బణం సమ్మతిప్రమాణ పరిమితి (టాలరెన్స్ బ్యాండ్) కి ఎగువన ఉన్నప్పటికీ దాని ఆధారభాత ముఖ్య కారకాలైన సరఫరా అఘాతాలు; ఆర్ధిక వ్యవస్థ అన్-లాక్ వల్ల, సరఫరా సంకెళ్ళు విడివడి మామూలు స్థితిలోకి చేరి కార్యకలాపాల యదాస్థితి మొదలవ్వగానే, రాబోయే మాసాల్లో పూర్తిగా తొలగిపోతాయి. తదనుగుణంగా, ద్రవ్య విధానం వైఖరిని నిర్ణయించేటప్పుడు వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని విచారించాలి. ఈ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలోయుంచుకొని, అభివృద్ధికి మరింత ఊతం కల్పించేందుకు ఉన్న వనరుల్ని వాడుకుంటూ ద్రవ్యోల్బణo ఒత్తిళ్ళు తగ్గే వరకు ప్రతీక్షించుతూ పాలసీ రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని MPC నిర్ణయించింది. 9. MPC సభ్యులందరూ - డాక్టర్ శశాంక భిడే, డాక్టర్ అష్మితా గోయల్, ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మ, డాక్టర్ మృదుల్ కె. సగ్గార్, డాక్టర్ మైఖేల్ దేబబ్రతా పాత్రా మరియు శ్రీ శక్తికాంత దాస్ - పాలసీ రెపో రేటు మార్చకుండా మరియు రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న టార్గెట్ లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 ప్రభావo నుండి ఉపశమనం తో పాటు, నిలకడతో వృద్ధి ని పునరుద్ధరించడం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను, మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అవసరమైనంతమేరకు సర్దుబాటు ధోరణినే కొనసాగించాలని ఏకగ్రీవంగా ఓటు వేశారు. డాక్టర్ శశాంక భిడే, డాక్టర్ అష్మితా గోయల్, డాక్టర్ మృదుల్ కె. సగ్గార్, డాక్టర్ మైఖేల్ దేబబ్రతా పాత్రా మరియు శ్రీ శక్తికాంత దాస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను, మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అవసరమైనంతమేరకు సర్దుబాటు ధోరణి నే కొనసాగించాలని అనుకూలంగాను, ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మఈ సిద్ధాంతీకరణకు ప్రతికూలంగాను ఓటు వేశారు. 10. MPC యొక్క మినిట్స్ ను అక్టోబర్ 23, 2020 లోగా ప్రచురించడం జరుగుతుంది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2020-2021/453 |