RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78526157

ద్రవ్య విధాన ప్రకటన, 2022-23 ద్రవ్య విధాన కమిటీ (MPC) తీర్మానం మే 2 మరియు 4, 2022

మే 04, 2022

ద్రవ్య విధాన ప్రకటన, 2022-23 ద్రవ్య విధాన కమిటీ (MPC) తీర్మానం మే 2 మరియు 4, 2022

ప్రస్తుత మరియు అభివృద్ధి చెందుతున్న స్థూల ఆర్థిక పరిస్థితి యొక్క అంచనా ఆధారంగా, ద్రవ్య విధాన కమిటీ (MPC) ఈ రోజు (మే 4, 2022) తన సమావేశంలోఈ క్రింది విధంగా నిర్ణయించింది:

  • లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (LAF) కింద పాలసీ రెపో రేటును, 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతంగా తక్షణ ప్రాతిపదికన అమలు పరచడం.

ఫలితంగా, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 4.15 శాతం మరియు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు మరియు బ్యాంక్ రేటు 4.65 శాతంగా కొనసాగుతాయి.

  • ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడానికి, వృద్ధికి తోడ్పాటునిచ్చేందుకు రాబోయే కాలంలో సర్దుబాటు వసతిని ఉపసంహరించుకోవడంపై దృష్టి సారిస్తూనే, MPC సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని నిర్ణయించింది.

MPC యొక్క ఈ నిర్ణయాలు, ఒకవైపున అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, వినియోగదారుల ధరల సూచీ (CPI) విషయంలో, +/- 2 శాతం బ్యాండ్ లో 4 శాతం ద్రవ్యోల్బణం మధ్యకాలిక ధ్యేయాన్నిసాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి.

ఈ నిర్ణయాలు తీసుకోవడoలోని ముఖ్య కారణాలను ఈ క్రింది ప్రకటనలో పొందుపరచడం జరిగింది:

అంచనాలు

అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ (గ్లోబల్ ఎకానమీ)

2. ఏప్రిల్ 2022లో MPC సమావేశం జరిగినప్పటి నుండి, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు మరియు ఆంక్షల ప్రేరేపిత అంతరాయాల నేపధ్యంలో, కొరతలు మరియు పెరుగుతున్న ధరలు కొనసాగుతూనే ఉన్నాయి మరియు ప్రతికూల ప్రమాదాలు పెరిగాయి. మూడు నెలల తక్కువ వ్యవధి లోపునే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 2022 సంవత్సారానికి ప్రపంచ ఉత్పత్తి వృద్ధి అంచనాను 0.8 శాతం పాయింట్లను తగ్గించి 3.6 శాతానికి సవరించింది. ఇంకా ప్రపంచ వాణిజ్య సంస్థ 2022 సంవత్సర ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాను 1.7 శాతం తగ్గించి, 3.0 శాతానికి కుదించింది.

దేశీయ ఆర్థిక వ్యవస్థ

3. COVID-19 యొక్క మూడవ వేవ్ క్షీణించడం మరియు పరిమితుల సడలింపుతో దేశీయ ఆర్థిక కార్యకలాపాలు మార్చి-ఏప్రిల్‌ లో స్థిరీకరించబడ్డాయి. పట్టణ డిమాండ్ నిరంతర విస్తరణ దిశలో ఉన్నట్లు కనిపిస్తోంది, కానీ గ్రామీణ డిమాండ్ కొంత బలహీనంగా ఉంది. పెట్టుబడి కార్యకలాపాలు ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. సరుకుల ఎగుమతులు వరుసగా పద్నాలుగు నెలలుగా ఏప్రిల్‌ నెలలో రెండంకెల విస్తరణను నమోదు చేశాయి. దేశీయ డిమాండ్‌ను మెరుగుపరచడం వల్ల చమురేతర మరియు బంగారమేతర దిగుమతులు కూడా బాగా పెరిగాయి.

4. మొత్తం గా సిస్టమ్ లిక్విడిటీ పెద్ద మిగులును నిర్వహించింది. ఏప్రిల్ 22, 2022 వరకు బ్యాంక్ క్రెడిట్ 11.1 శాతం (y-o-y) పెరిగింది. 2022-23 సంవత్సరానికి (ఏప్రిల్ 22 నాటికి), భారతదేశ విదేశీ మారక ద్రవ్యనిల్వలు US$ 6.9 బిలియన్లు తగ్గి US$ 600.4 బిలియన్లకు చేరాయి.

5. ప్రధాన CPI ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 6.1 శాతం నుండి మార్చి 2022 లో 7.0 శాతానికి పెరిగింది, ఇది ఎక్కువైన భౌగోళిక రాజకీయ స్పిల్‌ఓవర్‌ల ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నది. ఆహార ద్రవ్యోల్బణం 154 బేసిస్ పాయింట్లు పెరిగి 7.5 శాతానికి, కోర్ ద్రవ్యోల్బణం 54 బేసిస్ పాయింట్లు పెరిగి 6.4 శాతానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతున్న వాతావరణం మూలంగా ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. 2022 సంవత్సారానికి ద్రవ్యోల్బణం, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో 2.6 శాతం పెరిగి 5.7 శాతానికి మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ మరియు ఆర్థిక వ్యవస్థలలో 2.8 శాతం పెరిగి 8.7 శాతానికి IMF అంచనా వేసింది.

దృక్పథం (ఔట్లుక్)

6. అనిశ్చిత పరిస్థితి గణనీయంగా ద్రవ్యోల్బణం పథాన్ని చుట్టుముడుతున్నది, ఇది మార్పుచెందుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ కమోడిటీ ధరల డైనమిక్స్, ప్రధాన ఉత్పత్తి దేశాలలో ఉత్పత్తి నష్టాలు మరియు ఎగుమతి పరిమితుల కారణంవల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన కొరతల కారణంగా ప్రభావితమైన సున్నితమైన వస్తువుల ధరల ద్రవ్యోల్బణంతో సహా. భారతదేశంలో ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతూనే ఉంది. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి కానీ అస్థిరంగా ఉన్నాయి, ఇది ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రభావాల ద్వారా ద్రవ్యోల్బణ పథానికి గణనీయమైన నష్టాలను కలిగిస్తుంది. రాబోయే నెలల్లో ప్రధాన ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఇది దేశీయoగా ఎక్కువైన ఇంధనపంపు ధరలు మరియు అవసరమైన ఔషధాల ధరల ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ల పునరుద్ధరణ కారణంగా లాక్‌డౌన్‌లను మళ్లీ విధించడం మరియు సరఫరా-చైన్ లలో అంతరాయాలు ఎక్కువ కాలం పాటు అధిక లాజిస్టిక్స్ ఖర్చులను కొనసాగించగలవు. ఈ కారకాలన్నీ MPC ఏప్రిల్ ప్రకటనలో పేర్కొన్న ద్రవ్యోల్బణ పథాన్ని తలక్రిందులుచేసి గణనీయమైన నష్టాలను కలిగిస్తాయి.

7. దేశీయ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అవకాశాల విషయానికొస్తే, సాధారణ నైరుతి రుతుపవనాల అంచనా ఖరీఫ్ ఉత్పత్తి అవకాశాలను బాగా పెంచుతుంది. మూడవ వేవ్ లేకపోవడం మరియు పెరుగుతున్న టీకా కవరేజీ కారణంగా కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. బలమైన ప్రభుత్వ మూలధన వ్యయాలు(క్యాపెక్స్), సామర్థ్య వినియోగం మెరుగుపరచడం, పటువైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు మరియు అనుకూలమైన ఆర్థిక పరిస్థితుల నుండి పెట్టుబడి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పొందాలి. మరోవైపు, క్షీణిస్తున్న బాహ్య వాతావరణం, వస్తువుల అధిక ధరలు మరియు నిరంతర సరఫరా అడ్డంకుల తో పాటు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల ద్రవ్య విధాన సాధారణీకరణ అస్థిర స్పిల్‌ఓవర్‌ల కారణంగా, బలీయమైన ఎదురుగాలులను ఎదుర్కొంటున్నది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, భారత ఆర్థిక వ్యవస్థ భౌగోళిక రాజకీయ పరిస్థితులలో తిరోగమనాన్ని తట్టుకోగలదనిపిస్తున్నది, అయితే నష్టాల సమతుల్యతను నిరంతరం పర్యవేక్షించడం అనేది వివేకవంతమైన చర్య.

8. ఈ నేపధ్యంలో, MPC అభిప్రాయం ప్రకారం, ఆర్థిక కార్యకలాపాలు ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న శక్తుల సుడిగుండంలో అంతర్లీన ప్రాథమిక అంశాలు మరియు షాక్‌లకు వ్యతిరేకంగా బఫర్‌ల బలంతో మార్గనిర్దేశం చేస్తున్నప్పటికీ, సమీప-కాల ద్రవ్యోల్బణ దృక్పథానికి ప్రమాదాలు ఎక్కువగానే పెరుగుతున్నాయి. ముద్రిత మార్చి ద్రవ్యోల్బణం మరియు ఆ తర్వాతి పరిణామాలలో ఈ విషయం ప్రస్ఫుట మవుతున్నది. ఈ పరిస్థితులలో, MPC అంచానా ఏమిటంటే ద్రవ్యోల్బణ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని; స్థిరమైన మరియు క్రమాంకన చర్యల వల్ల దాని రెండోమారు ప్రభావాలను అరికట్టవచ్చునని అంచనా వేస్తున్నది. దీని ప్రకారం, పాలసీ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ 4.40 శాతoగా ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడానికి మరియు మరింతగా వృద్ధికి తోడ్పాటునిచ్చేందుకు సర్దుబాటువసతిని ఉపసంహరించుకోవడంపై దృష్టి సారిస్తూనే MPC సర్దుబాటుధోరణిని కొనసాగించాలని నిర్ణయించింది.

9. MPC సభ్యులందరూ – డాక్టర్ శశాంక్ భిడే, డాక్టర్ అషిమా గోయల్, ప్రొ. జయంత్ ఆర్. వర్మ, డాక్టర్ రాజీవ్ రంజన్, డాక్టర్ మైఖేల్ దేవబ్రత పాత్ర మరియు శ్రీ శక్తికాంత దాస్ పాలసీ రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల తో 4.4 శాతానికి పెంచాలని ఏకగ్రీవంగా ఓటు వేశారు.

10. సభ్యులందరూ అంటే డాక్టర్ శశాంక్ భిడే, డాక్టర్ అషిమా గోయల్, ప్రొ. జయంత్ ఆర్. వర్మ, డా. రాజీవ్ రంజన్, డాక్టర్. మైఖేల్ దేవబ్రత పాత్ర మరియు శ్రీ. శక్తికాంత దాస్, ద్రవ్యోల్బణ లక్ష్యానికి అనుగుణంగానే ముందుకు సాగడానికి, అభివృద్ధికి తోడ్పాటునిచ్చేందుకు నిర్ధారించిన సర్దుబాటువసతి చర్యలను ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించి సర్దుబాటుధోరణిని కొనసాగించాలని ఏకగ్రీవంగా ఓటు వేశారు.

11. MPC సమావేశం యొక్క వివరాల టిప్పణి (మినిట్స్) మే 18, 2022 న ప్రచురించడం జరుగుతుంది.

12. ఎంపిసి (MPC) యొక్క తదుపరి సమావేశం జూన్ 6-8, 2022 లో షెడ్యూల్ చేయబడింది.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/154

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?