<font face="mangal" size="3">నగర్ సహకార బ్యాంకు లిమిటెడ్, గోరఖ్ పూర్, ఉత్త - ఆర్బిఐ - Reserve Bank of India
నగర్ సహకార బ్యాంకు లిమిటెడ్, గోరఖ్ పూర్, ఉత్తర్ ప్రదేశ్ - జరిమానా విధింపు
సెప్టెంబర్ 18, 2018 నగర్ సహకార బ్యాంకు లిమిటెడ్, గోరఖ్ పూర్, ఉత్తర్ ప్రదేశ్ - జరిమానా విధింపు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ‘మీ ఖాతాదారుని తెలుసుకోండి’ నిబంధనల విషయంలో, భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క నిర్దేశాలు/సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, నగర్ సహకార బ్యాంకు లిమిటెడ్, గోరఖ్ పూర్, ఉత్తర్ ప్రదేశ్ ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 2,00,000/-(రెండు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/645 |