<font face="mangal" size="3">నేషనల్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, లక్నో, ఉత్ - ఆర్‌బిఐ - Reserve Bank of India
నేషనల్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, లక్నో, ఉత్తర్ ప్రదేశ్ - జరిమానా విధించబడినది
మార్చ్ 13, 2019 నేషనల్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, లక్నో, ఉత్తర్ ప్రదేశ్ - జరిమానా విధించబడినది బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, అనుపాలన నివేదిక సమర్పించడంలో ఆలస్యం జరిగి, ఆర్‌బిఐ సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, నేషనల్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, లక్నో, ఉత్తర్ ప్రదేశ్ ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 50,000 (యాభై వేల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. అనిరుధ డి జాదవ్ పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/2173 |