<font face="mangal" size="3">నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,  - ఆర్బిఐ - Reserve Bank of India
నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ పై జరిమానా విధింపు.
అక్టోబర్ 17, 2018 నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ పై జరిమానా విధింపు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47A(1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు దఖలుపరచబడిన అధికారములతో, నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ పై, పూచీ లేని వ్యక్తిగత ఋణాలకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన సూచనలు /నిబంధనలను బ్యాంక్ ఉల్లంఘించినందులకు మరియు కే.వై.సి. లోపాల మూలంగా, ₹ 2.00 లక్షల (రెండు లక్షల రూపాయలు) నగదు జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వక సమాధానం దాఖలు చేసింది. ఈ సందర్భంగా కేసు సంబంధిత నిజానిజాలు మరియు బ్యాంక్ ఇచ్చిన సమాధానం పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/900 |