RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502199

NCFE – జాతీయ ఆర్థిక అక్షరాస్యత అంచనా పరీక్ష (National Fincancial Literacy Assessment Test, NCFE-NFLAT) – 2017-18

తేదీ: సెప్టెంబర్ 25, 2017

NCFE – జాతీయ ఆర్థిక అక్షరాస్యత అంచనా పరీక్ష (National Fincancial Literacy
Assessment Test, NCFE-NFLAT) – 2017-18

జాతీయ ఆర్థిక విద్యా కేంద్రం (National Centre for Financial Education, NCFE), 'జాతీయ ఆర్థిక అక్షరాస్యత అంచనా పరీక్ష 2017-18' లో పాల్గొనడానికి, VI నుంచి XII తరగతుల్లో చదువుతున్న అందరు పాఠశాల విద్యార్థులను, ఆహ్వానిస్తోంది.

జాతీయ ఆర్థిక విద్యా కేంద్రం, RBI, SEBI, IRDAI మరియు PFRDA వంటి అన్ని నియంత్రణా సంస్థల ప్రోత్సాహంతో, ఆర్థిక విద్య పెంపొందిచడానికి చేపట్టిన జాతీయ ప్రణాళిక. ప్రస్తుతం NISM చే నిర్వహణలో ఉన్నది.

NCFE-NFLAT 2017-18 గురించి:

ఈ పరీక్ష మూడు వర్గాల్లో నిర్వహించబడుతుంది – NFLAT జూనియర్ (6 నుంచి 8 తరగతులవరకు); NFLAT (9 మరియు 10వ తరగతులు); NFLAT సీనియర్ (11 మరియు 12వ తరగతులు). తగిన IT వసతులుగల పాఠశాలలు, ఈ పరీక్ష వారి ప్రాంగణంలోనే జరపవచ్చు. ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ భాషల్లో జరపబడుతుంది.

మూడు వర్గాల్లోనూ, నమోదు ప్రక్రియ ఆరంభమైనది. పాఠశాలలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవలెనని ప్రొత్సహిస్తున్నాము. ముందు పాఠశాలల నమోదు పూర్తి అయిన తరువాత, విద్యార్థులను వారే నమోదు చేసుకోవలెను. ప్రతి పాఠశాల, వారి విద్యార్థుల పరీక్షను వారే పర్యవేక్షించవలెను. అవసరమైతే, NCFE బృందం వారికి సహాయపడుతుంది. ఈ పరీక్ష ఉచితంగా నిర్వహించబడుతుంది.

పాఠశాలలు http://www.ncfeindia.org/nflat లింకుద్వారా నమోదు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

వివరాలు ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు ఆఫ్‌లైన్‌ పరీక్ష తేదీలు
నమోదు డిసెంబర్ 30, 2017 వరకు అక్టోబర్ 01, 2017 నుండి నవంబర్ 10, 2017 వరకు
పరీక్ష డిసెంబర్ 31, 2017 లోగా, ఏరోజైనా డిసెంబర్ 12, 2017 (ఒకే రోజు)
ప్రాంతీయ మరియు జాతీయ పోటీ ఏప్రిల్ 1 – 30, 2018 మధ్యలో

బహుమతులు:

పాల్గొన్న ప్రతివిద్యార్థికి, ఒక యోగ్యతాపత్రం లభిస్తుంది. ఇంతేగాక, విద్యార్థులకు, పాఠశాలలకు, నగదు బహుమతులు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కిండిల్స్, పతకాలు మొదలైన ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయి. వివరాలకు http://ncfeindia.org/nflat, దయచేసి చూడండి.

అన్ని పాఠశాలలూ ఈ అవకాశాన్ని వియోగించుకోగలరు.

మరిన్ని వివరాలు వీరినుంచి పొందవచ్చు:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్, NISM భవన్‌, ప్లాట్ నం. 82, సెక్టర్ -17, వాషి, నవీ ముంబై-400703

ఫోన్‌: 022-66734600-02; ఇ-మైల్: nflat@nism.ac.in; వెబ్‌సైట్: www.ncfeindia.org

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/820

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?