<font face="mangal" size="3">నేసర్గీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ - ఆర్బిఐ - Reserve Bank of India
నేసర్గీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నేసర్గీ, కర్ణాటక పై - జరిమానా విధింపు
నవంబర్ 26, 2019 నేసర్గీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నేసర్గీ, కర్ణాటక పై - జరిమానా విధింపు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టo, 1949 సెక్షన్ 47ఏ(1)(సి)తోపాటు సెక్షన్ 46(4) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు సంక్రమించిన అధికారాలతో నేసర్గీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నేసర్గీ, కర్ణాటక పై సెక్షన్ 27(2) బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 క్రింద వివరణ పట్టికలను (రిటర్న్స్) సమర్పించనందులకు ₹ 0.20 లక్షల (ఇరవై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించింది. 2. భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంక్ వైయక్తిక వినతిని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన నిజానిజాలు మరియు బ్యాంక్ ఇచ్చిన సమాధానo పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది. (యోగేష్ దయాళ్)
పత్రికా ప్రకటన: 2019-2020/1267 |