<font face="mangal" size="3">నోబెల్ సహకార బ్యాంకు లిమిటెడ్, నోయిడా, (యు.పి.) -  - ఆర్బిఐ - Reserve Bank of India
నోబెల్ సహకార బ్యాంకు లిమిటెడ్, నోయిడా, (యు.పి.) - జరిమానా విధింపు
తేది: 12/07/2019 నోబెల్ సహకార బ్యాంకు లిమిటెడ్, నోయిడా, (యు.పి.) - జరిమానా విధింపు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, నోబెల్ సహకార బ్యాంకు లిమిటెడ్, నోయిడా, (యు.పి.) ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 1,00,000/- (లక్ష రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించింది. మోసపూరిత బ్యాంకింగ్ కార్యకలాపాల యొక్క వర్గీకరణ మరియు వాటిని నివేదించడం లో భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించబడింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖిత పూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/131 |