<font face="mangal" size="3">నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటĺ - ఆర్బిఐ - Reserve Bank of India
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (చిన్న రుణ బ్యాంకు) కార్యకలాపాలు ప్రారంభించింది
అక్టోబర్ 17, 2017 నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (చిన్న రుణ బ్యాంకు) కార్యకలాపాలు ప్రారంభించింది నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ చిన్న రుణ బ్యాంకుగా (స్మాల్ ఫైనాన్స్ బాంక్) తమ కార్యకలాపాలను అక్టోబర్ 17, 2017 తారీఖు నుండి ప్రారంభించింది. ఈ బ్యాంకు చిన్న రుణ బ్యాంకుగా కార్యకలాపాల నిర్వహించేందుకు , రిజర్వు బాంకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 22 (1) క్రింద , లైసెన్స్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 16, 2015 వ తేదీ పత్రికా ప్రకటనలో తెలుపబడిన, చిన్న రుణ బ్యాంకులను నెలకొల్పడానికి సూత్రప్రాయపు అనుమతి జారీచేయబడ్డ పదిమంది దరఖాస్తుదారులలో, RGVN (నార్త్ ఈస్ట్) మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ ఒకటి. జోస్ జె. కట్టూర్ ప్రెస్ రిలీజ్: 2017-2018/1069 |