యన్ యస్ డి యల్ (NSDL) పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కార్యకలాపాలు ప్రారంభo
అక్టోబర్ 29, 2018 యన్ యస్ డి యల్ (NSDL) పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కార్యకలాపాలు ప్రారంభo యన్ యస్ డి యల్ (NSDL) పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ చెల్లింపుల (పేమెంట్స్) బ్యాంక్ గా తమ కార్యకలాపాలను అక్టోబర్ 29, 2018 తారీఖు నుండి ప్రారంభించింది. ఈ బ్యాంక్ చెల్లింపుల (పేమెంట్స్) బ్యాంక్ గా ఇండియా లో కార్యకలాపాలను నిర్వహించేందులకు, రిజర్వు బ్యాంకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 22 (1) క్రింద , లైసెన్స్ మంజూరు చేసింది. ఆగస్ట్ 19, 2015 వ తేదీ పత్రికా ప్రకటనలో తెలుపబడిన, చెల్లింపుల (పేమెంట్స్) బ్యాంక్ లను నెలకొల్పడానికి సూత్రప్రాయపు అనుమతి జారీచేయబడ్డ పదకొండు మంది దరఖాస్తుదారులలో, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరి లిమిటెడ్, ముంబై కూడా ఒకటి. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/991 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: