<font face="mangal" size="3">అత్యవసర ఆరోగ్య సేవలకు ప్రాప్యతను సులభతరం చĺ - ఆర్‌బిఐ - Reserve Bank of India
అత్యవసర ఆరోగ్య సేవలకు ప్రాప్యతను సులభతరం చేయడానికి ఆన్-ట్యాప్ టర్మ్ లిక్విడిటీ సౌకర్యం
తేది: 07/05/2021 అత్యవసర ఆరోగ్య సేవలకు ప్రాప్యతను సులభతరం చేయడానికి దేశంలో కోవిడ్-సంబంధిత ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు మరియు సేవలకు తక్షణ ద్రవ్యతను పెంచడానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ మే 05, 2021న తన స్టేట్‌మెంట్‌లో ప్రకటించినట్లుగా, ₹50,000 కోట్ల ఆన్-ట్యాప్ లిక్విడిటీ విండోను మూడేళ్ల వ్యవధి వరకు అంటే మార్చి 31, 2022 వరకు రెపో రేటుతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పథకం క్రింద, వ్యాక్సిన్ తయారీదారులతో సహా; విస్తృత శ్రేణి సంస్థలకు; టీకా మరియు ప్రాధాన్యత వైద్య పరికరాల దిగుమతిదారులు/సరఫరాదారులు; ఆసుపత్రులు/డిస్పెన్సరీలు; పాథాలజీ ల్యాబ్‌లు మరియు విశ్లేషణ కేంద్రాలు; ఆక్సిజన్ మరియు వెంటిలేటర్ల తయారీదారులు మరియు సరఫరాదారులు; టీకాలు మరియు కోవిడ్-సంబంధిత ఔషధాల దిగుమతిదారులు; కోవిడ్-సంబంధిత లాజిస్టిక్స్ సంస్థలు మరియు చికిత్స కోసం రోగులకు, బ్యాంకులు తాజా రుణ మద్దతును అందించగలవు. 2. అటువంటి రుణాలకు మార్చి 31, 2022 వరకు ఈ పథకం క్రింద ప్రాధాన్యత వర్గ ఋణ (పిఎస్ఎల్) వర్గీకరణను పొడిగించడం ద్వారా పరపతి పంపిణీ త్వరగా చేయడానికి బ్యాంకులు ప్రోత్సహించబడుతున్నాయి. ఈ రుణాలు , ఏది ముందు ఐతే అది ప్రాతిపదికన తిరిగి చెల్లించే/ గడువు పరిపక్వత వరకు పిఎస్‌ఎల్ క్రింద వర్గీకరించబడతాయి. బ్యాంకులు ఈ రుణాలను నేరుగా రుణగ్రహీతలకు లేదా ఆర్‌బిఐచే నియంత్రించబడే మధ్యవర్తిత్వ ఆర్థిక సంస్థల ద్వారా పంపిణీ చేయవచ్చు. 3. ఈ పథకం క్రింద బ్యాంకులు ఒక కోవిడ్ రుణ పుస్తకాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. అదనపు ప్రోత్సాహకం ద్వారా, అటువంటి బ్యాంకులు తమ మిగులు ద్రవ్యతను రివర్స్ రెపో విండో క్రింద ఆర్‌బిఐతో కోవిడ్ రుణ పుస్తక పరిమాణం వరకు రెపో రేటు కంటే 25 బిపిఎస్ తక్కువగా ఉంచడానికి అర్హత పొందుతాయి. 4. పైన పేర్కొన్న నిర్దిష్ట విభాగాలకు రుణాలు ఇచ్చే పథకం క్రింద, ఆర్‌బిఐ నుండి నిధులు పొందకుండా తమ సొంత వనరులను ఉపయోగించాలని కోరుకునే బ్యాంకులు, పైన పేర్కొన్న 2 మరియు 3 పేరాలో వున్న ప్రోత్సాహకాలకు అర్హులు. 5. పథకం యొక్క కార్యాచరణ వివరాలు అనుబంధం-1 లో ఇవ్వబడ్డాయి. మీ విధేయులు (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2021-2022/177 అత్యవసర ఆరోగ్య సేవల పథకానికి ప్రాప్యతను సులభతరం చేయడానికి ఆన్-ట్యాప్ టర్మ్ లిక్విడిటీ సౌకర్యం యొక్క కార్యాచరణ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి: (ఎ) ఈ పథకం మే 07, 2021 నుండి మార్చి 31, 2022 వరకు అమలులో ఉంటుంది. (బి) లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (ఎల్‌ఐఎఫ్) క్రింద అర్హత ఉన్న అన్ని బ్యాంకులు ఈ పథకంలో పాల్గొనవచ్చు. ఆర్‌బిఐ నుండి నిధులు పొందాలని కోరుకునే బ్యాంకుల నుండి వచ్చిన అభ్యర్థనలు దరఖాస్తు తేదీ నాటికి నిధుల లభ్యతకు లోబడి ఉంటాయి, అనగా, మొత్తం ₹ 50,000 కోట్లు ఇప్పటికే పొందితే, నిధులు హామీ ఇవ్వబడవు. ఇంకా, బ్యాంకులు సహేతుకమైన వ్యవధిలో రుణాలు ఇవ్వడానికి ప్రయత్నించాలి, అనగా, ఆర్‌బిఐ నుండి నిధులు పొందిన తేదీ నుండి 30 రోజుల తరువాత కాకుండా. ఈ పథకం క్రింద బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సంబంధించి ఎటువంటి పరిమితి లేదు. ఏదేమైనా, ఆర్‌బిఐ నుండి తీసుకున్న రుణం మొత్తాన్ని ఈ పథకం పరిపక్వత అయ్యే వరకు పేర్కొన్న విభాగాలకు రుణాలు ఇవ్వడం ద్వారా బ్యాంకులు ఎప్పటికప్పుడు మద్దతునిచ్చేలా చూడాలి. (సి) ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకునేలా (ఆన్ టాప్), బ్యాంకులు నిధుల కోసం అభ్యర్థనలను అనుబంధం-2 లో పొందుపరిచిన ఫార్మాట్‌లో ఇ-మెయిల్ ద్వారా పంపించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ అటువంటి అభ్యర్థనలన్నింటినీ సమీకరించి, ప్రతి సోమవారం (సోమవారం సెలవుదినం అయితే, మరుసటి పనిదినం నాడు) అభ్యర్థిస్తున్న బ్యాంకుతో 3 సంవత్సరాల రెపో ఒప్పందంతో, నిధులను విడుదల చేస్తుంది. (డి) వారంలో ఒక బ్యాంకు బహుళ అభ్యర్ధనలను ఇస్తే, అటువంటి అభ్యర్థనలన్నీ సమగ్రపరిచి మరియు కార్యాచరణ తేదీన ఒకే రెపో ఒప్పందం అమలు పరచబడుతుంది. (ఇ) కార్యాచరణ తేదీన పథకం క్రింద అభ్యర్థించిన మొత్తం మిగిలిన మొత్తాన్ని మించి ఉంటే, మిగిలిన మొత్తం అర్హత గల అన్ని అభ్యర్థనలకు ప్రో-రేటా ప్రాతిపదికన పంపిణీ చేయబడుతుంది. (ఎఫ్) కేటాయింపు పరిమాణాన్ని నిర్ణయించే మరియు/లేదా ఏదైనా లేదా అన్ని అభ్యర్థనలను పూర్తిగా/పాక్షికంగా, ఎటువంటి కారణం కేటాయించకుండా అంగీకరించే/తిరస్కరించే హక్కు రిజర్వ్ బ్యాంకుకు ఉంటుంది. (జి) అర్హతగల అనుషంగిక మరియు మార్జిన్ అవసరాలు ఎల్ఎఎఫ్ (LAF) కార్యకలాపాలకు వర్తించే విధంగానే ఉంటాయి. అభ్యర్థించిన బ్యాంక్ కార్యకలాపాల తేదీన దాని రెపో ఖాతాలో తగినంత మొత్తంలో సెక్యూరిటీలు అందుబాటులో ఉండేలా చూడాలి. భద్రతా ప్రత్యామ్నాయానికి సదుపాయంతో సహా ఎల్ఎఎఫ్ కార్యకలాపాలకు వర్తించే అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులు కూడా ఈ పథకానికి వర్తిస్తాయి, ఇతర విషయాలు తదనుగుణంగా మార్చడానికి అనుమతినిస్తూ. (h) బ్యాంకులు తమ మిగులు ద్రవ్యతను కోవిడ్ రుణ పుస్తక పరిమాణం వరకు ప్రతి రిపోర్టింగ్‌లో శుక్రవారం ఉదయం 11:30 మరియు మధ్యాహ్నం 12 గంటల మధ్య నిర్వహించబడే ప్రత్యేకమైన 14 రోజుల రివర్స్ రెపో విండోలో ఉంచవచ్చు. అలాంటి మొదటి కార్యకలాపాలు మే 21, 2021న జరుగుతాయి. ఈ 14 రోజుల రివర్స్ రెపో కార్యకలాపాలు మార్చి 31, 2022 వరకు కొనసాగుతాయి మరియు తరువాత సమీక్షించబడతాయి. ప్రత్యేక 14 రోజుల రివర్స్ రెపో విండోలో నిధులను ఉంచడానికి ముందు పైన పేర్కొన్న షరతులకు అనువర్తనాన్ని బ్యాంకులు జాగ్రత్తగా పాటించాలి. (i) ఈ పథకం క్రింద ఆర్‌బిఐ నుండి నిధులు పొందకుండా తమ సొంత వనరులను ఉపయోగించుకోవాలనుకునే బ్యాంకులు కూడా పైన పేర్కొన్న పారా (హెచ్) లో పేర్కొన్న సౌకర్యాలకు అర్హులు. పేర్కొన్న విభాగాలకు రుణాలు ఇవ్వడానికి తమ సొంత వనరులను వినియోగించుకునే బ్యాంకులు ఈ పథకం ముగిసే వరకు ప్రతి సోమవారం మునుపటి వారంలో కోవిడ్ రుణ పుస్తకంలో ఏవైనా మార్పుల గురించి ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆపరేషన్ విభాగానికి ఇ-మెయిల్ ద్వారా తెలియజేయడం అవసరం. (j) మార్కెట్లో పాల్గొనేవారికి, ఈ పథకం క్రింద ఉపయోగించిన మొత్తాన్ని మనీ మార్కెట్ ఆపరేషన్స్ (MMO) పత్రికా ప్రకటనలో తెలియజేయబడుతుంది. (k) సౌకర్యం యొక్క కార్యాచరణ అంశాలకు సంబంధించిన అన్ని ప్రశ్నలు/స్పష్టీకరణలను ఇ-మెయిల్ మరియు/లేదా టెలిఫోన్ (022-22630982) ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆపరేషన్స్ విభాగానికి పంపవచ్చు. అన్ని సాంకేతిక సమస్యలు కాపీతో ఇ-మెయిల్ laffmd@rbi.org.in మరియు/లేదా టెలిఫోన్ (022-27595662/67/ 022-27595591/92/93/94) ద్వారా ఇ-కుబెర్ హెల్ప్‌డెస్క్ ను సంప్రదించవచ్చును. |