<font face="mangal" size="3">ప్రభుత్వ లావాదేవీలు జరుపుటకై ఏప్రిల్ 1, 2017 తేదీ - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రభుత్వ లావాదేవీలు జరుపుటకై ఏప్రిల్ 1, 2017 తేదీన అన్ని ప్రాతినిధ్య బ్యాంకులు తెరిచి ఉంచుట - సవరించిన ఆదేశాలు
RBI/2016-17/259 మార్చ్ 29, 2017 అన్ని ప్రాతినిధ్య బ్యాంకులు అయ్యా/అమ్మా, ప్రభుత్వ లావాదేవీలు జరుపుటకై ఏప్రిల్ 1, 2017 తేదీన అన్ని ప్రాతినిధ్య బ్యాంకులు తెరిచి ఉంచుట - సవరించిన ఆదేశాలు మా సర్క్యులర్ DBR.No.Leg.BC.55/09.07.005/2016-17 తేదీ మార్చ్ 24, 2017 ద్వారా అన్ని ప్రాతినిధ్య బ్యాంకులను, ప్రభుత్వ లావాదేవీలు జరిపే వారి శాఖలన్నింటినీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని రోజులూ మరియు ఏప్రిల్ 1, 2017 (శనివారాలు, ఆదివారాలు మరియు అన్ని శెలవు దినాలతో సహా) తేదీన తెరిచి ఉంచాలని ఆదేశించడం జరిగింది. 2. ఈ సందర్భంగా, ఏప్రిల్ 1, 2017 తేదీన బ్యాంక్ శాఖలు తెరిచి ఉంచడం వల్ల వార్షిక ముగింపు (annual closing) కార్యకలాపాలకు - ప్రత్యేకించి ఆ తేదీనుండి కొన్ని బ్యాంకుల విలీనీకరణ దృష్ట్యా - అంతరాయం కలుగవచ్చని నివేదనలు అందినవి. అందువల్ల, ప్రభుత్వంతో చర్చించిన తరువాత, ప్రభుత్వ లావాదేవీలు జరుపుతున్న ప్రాతినిధ్య బ్యాంకుల శాఖలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజూ (శనివారాలు, ఆదివారాలు మరియు అన్ని శెలవు దినాలతో సహా), ఇంతకు ముందే సూచించినట్లు తెరిచి ఉంచాలనీ, అయితే, ఈ శాఖలు ఏప్రిల్ 1, 2017 తేదీన తెరిచి ఉంచవలసిన అవసరం లేదని, నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ విధేయులు, (రాజిందర్ కుమార్) |