<font face="mangal" size="3">బ్యాంకుల ద్వారా వాడుక ఖాతాలు తెరవడం - క్రమశి - ఆర్‌బిఐ - Reserve Bank of India
బ్యాంకుల ద్వారా వాడుక ఖాతాలు తెరవడం - క్రమశిక్షణ యొక్క అవసరం
ఆర్‌బిఐ/2020-21/20 ఆగస్టు 6, 2020 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు మేడమ్/ప్రియమైన సర్, బ్యాంకుల ద్వారా వాడుక ఖాతాలు తెరవడం - క్రమశిక్షణ యొక్క అవసరం బ్యాంకుల ద్వారా వాడుక ఖాతాలు తెరవడం - క్రమశిక్షణ యొక్క అవసరం అంశంపై జూలై 2, 2015 నాటి సర్క్యులర్ DBR.Leg.BC.25./09.07.005/2015-16 ను చూడండి. బ్యాంకుల ద్వారా వాడుక ఖాతాలను తెరవడానికి సూచనలు సమీక్షించబడ్డాయి. సవరించిన సూచనలు క్రింది విధంగా ఉన్నాయి: i. బ్యాంకింగ్ వ్యవస్థ నుండి నగదు క్రెడిట్ (సిసి)/ఓవర్‌డ్రాఫ్ట్ (ఒడి) రూపంలో రుణ సదుపాయాలను పొందిన వినియోగదారుల కోసం ఏ బ్యాంకూ వాడుక ఖాతాలను తెరవరాదు మరియు అన్ని లావాదేవీలు సిసి/ఓడి ఖాతా ద్వారా మాత్రమే నిర్వహించబడాలి. ii. ఒక రుణ గ్రహీత కు ఒక బ్యాంకు యొక్క ఎక్స్పోజర్1, ఆ రుణ గ్రహీతకు బ్యాంకింగ్ సిస్టం యొక్క ఎక్స్పోజర్ కన్నా పది శాతం తక్కువగా ఉన్న పరిస్థితిలో, క్రెడిట్స్ ఉచితంగా అనుమతించినప్పటికీ, కాష్ క్రెడిట్/ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలో డెబిట్స్, ఆ కాష్ క్రెడిట్/ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలో క్రెడిట్స్, ఒక బ్యాంకు యొక్క ఎక్స్పోజర్ ఆ రుణగ్రహీత కు ఉన్న బ్యాంకింగ్ ఎక్స్పోజర్ కన్నాపది శాతం కంటే ఎక్కువ గా ఉన్న మేరకే అనుమతించబడతాయి. బ్యాంక్ మరియు రుణగ్రహీత మధ్య అంగీకరించిన పౌన:పున్యంలో ఈ ఖాతాల నుండి చెప్పిన బదిలీదారు సిసి/ఓడి ఖాతాకు నిధులు పంపబడతాయి. అంతేకాకుండా, అటువంటి ఖాతాల్లోని క్రెడిట్ నిల్వలు ఏ నాన్ ఫండ్-ఆధారిత క్రెడిట్ సదుపాయాలను పొందటానికి మార్జిన్‌గా ఉపయోగించబడవు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు ఆ రుణగ్రహీతకు బ్యాంకింగ్ ఎక్స్పోజర్ పది శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే, నిధులను పంపించాల్సిన బ్యాంకును, రుణగ్రహీత మరియు బ్యాంకుల మధ్య పరస్పరంగా నిర్ణయించబడుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ఎక్స్పోజర్లో పది శాతం కంటే తక్కువ రుణగ్రహీతకు ఎక్స్పోజర్ అయిన బ్యాంకులు, రుణగ్రహీతకు వర్కింగ్ క్యాపిటల్ డిమాండ్ లోన్ (డబ్ల్యుసిడిఎల్)/ వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్ (డబ్ల్యుసిటిఎల్) సౌకర్యాన్ని అందించవచ్చు. iii. రుణగ్రహీతకు బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఎక్స్పోజర్లో పది శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా ఉన్నచోట, ఇప్పటివరకు వున్న సిసి/ఓడి సదుపాయాన్ని యధాతధంగా అందిస్తుంది. iv. బ్యాంక్ క్రెడిట్ డెలివరీ కోసం రుణ వ్యవస్థపై మార్గదర్శకాల డిసెంబర్ 5, 2018 నాటి సర్క్యులర్ DBR.BP.BC.No.12/21.04.048/2018-19 పరిధిలో ఉన్న రుణగ్రహీతల విషయంలో, వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాన్ని రుణ భాగాలుగా విభజించడం మరియు కన్సార్టియం రుణాలతో సహా అన్ని సందర్భాల్లో నగదు క్రెడిట్ భాగం ఇకపై వ్యక్తిగత బ్యాంక్ స్థాయిలో నిర్వహించబడుతుంది. v. ఏ బ్యాంకు నుండి అయినా సిసి/ఓడి సదుపాయం పొందని ఖాతాదారుల విషయంలో, బ్యాంకులు వాడుక ఖాతాలను ఈ క్రింది విధంగా తెరవవచ్చు: a. బ్యాంకింగ్ వ్యవస్థకు ఎక్సపోజర్ ₹50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న రుణగ్రహీతల విషయంలో, బ్యాంకులు ఎస్క్రో యంత్రాంగాన్ని అనుసరించాలి. దీని ప్రకారం, అటువంటి రుణగ్రహీతల వాడుక ఖాతాలను ఎస్క్రో మేనేజింగ్ బ్యాంక్ మాత్రమే తెరవవచ్చు/ నిర్వహించవచ్చు. ఏదేమైనా, బ్యాంకు మరియు రుణగ్రహీత మధ్య అంగీకరించిన పౌన: పున్యంలో ఈ ఖాతాల నుండి ఎస్క్రో ఖాతాకు నిధులు పంపబడతాయి అనే షరతుకు లోబడి బ్యాంకులకు రుణాలు ఇవ్వడం ద్వారా సేకరణ ఖాతాలలో (‘కలెక్షన్ అకౌంట్స్’) తెరవడానికి ఎటువంటి పరిమితి లేదు. అంతేకాకుండా, అటువంటి ఖాతాల్లోని నిల్వలు ఏ నాన్ ఫండ్-ఆధారిత క్రెడిట్ సదుపాయాలను పొందటానికి మార్జిన్‌గా ఉపయోగించబడవు. ‘సేకరణ ఖాతాలలో’ మొత్తం లేదా క్రెడిట్ల సంఖ్యపై నిషేధం లేనప్పటికీ, ఈ ఖాతాల్లోని డెబిట్‌లు ఎస్క్రో ఖాతాకు పంపించే ఉద్దేశ్యంతో పరిమితం చేయబడతాయి. రుణాలు ఇవ్వని బ్యాంకులు అటువంటి రుణగ్రహీతలకు వాడుక ఖాతాను తెరవకూడదు. బి. బ్యాంకింగ్ వ్యవస్థకు ఎక్సపోజర్ ₹5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ కాని ₹50 కోట్ల కన్నా తక్కువ ఉన్న రుణగ్రహీతల విషయంలో, రుణ బ్యాంకులు వాడుక ఖాతాలను తెరవడానికి ఎటువంటి పరిమితి లేదు. ఏదేమైనా, రుణాలు ఇవ్వని బ్యాంకులు పేరా (v) (a) వద్ద నిర్వచించిన సేకరణ ఖాతాలను మాత్రమే తెరవగలవు. సి. బ్యాంకింగ్ వ్యవస్థకు ఎక్సపోజర్ ₹5 కోట్ల కంటే తక్కువ ఉన్న రుణగ్రహీతల విషయంలో, అటువంటి ఖాతాదారులు, బ్యాంకింగ్ వ్యవస్థ నుండి ₹5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ సదుపాయాలు పొందినప్పుడు, బ్యాంకు (ల) కు తెలియజేయాలి అనే ఒక ఒప్పందానికి లోబడి బ్యాంకులు వాడుక ఖాతాలను తెరవవచ్చు. అటువంటి ఖాతాదారుల వాడుక ఖాతా, బ్యాంకింగ్ వ్యవస్థకు ఎక్సపోజర్ ₹5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మరియు ₹50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అయినప్పుడు, వరుసగా పేరా (v) (b) మరియు (v) (a) నిబంధనల ద్వారా నిర్వహించబడుతుంది. డి. బ్యాంకింగ్ వ్యవస్థ నుండి ఎటువంటి క్రెడిట్ సదుపాయాలను పొందని కాబోయే ఖాతాదారుల వాడుక ఖాతాలను అట్టి బ్యాంకులు వారి బ్యాంకు బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం అవసరమైన శ్రద్ధకు లోబడి, తెరవవచ్చు. 2. బ్యాంకులు అన్ని వాడుక ఖాతాలను మరియు సిసి/ఒడిలను క్రమం తప్పకుండా కనీసం త్రైమాసిక ప్రాతిపదికన పర్యవేక్షిస్తూ, ప్రత్యేకంగా బ్యాంకింగ్ వ్యవస్థను రుణగ్రహీత ఎక్సపోజర్కు సంబంధించి, ఈ సూచనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. 3. బ్యాంకులు టర్మ్ లోన్ల నుండి వాడుక ఖాతాల ద్వారా డ్రా చేయకూడదు. టర్మ్ లోన్స్ నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి కాబట్టి, నిధులను నేరుగా వస్తువులు మరియు సేవల సరఫరాదారుకు పంపించాలి. రుణగ్రహీత రోజువారీ కార్యకలాపాల కోసం చేసే ఖర్చులు రుణగ్రహీతకు సిసి/ఒడిఖాతా ఉంటే, సిసి/ఒడి ఖాతా ద్వారా, లేకపోతే వాడుక ఖాతా ద్వారా మళ్ళించాలి. 4. ఈ సర్క్యులర్ తేదీ నుండి మూడు నెలల వ్యవధిలో, బ్యాంకులు పై సూచనలకు అనుగుణంగా ప్రస్తుత వాడుక మరియు సిసి/ఓడి ఖాతాలు ఉండేలా చూడాలి. మీ విధేయులు, (సౌరవ్ సిన్హా) జతపర్చబడినవి: ఫ్లోచార్ట్స్ 1 ఈ సూచనల ప్రకారం, ‘ఎక్సపోజర్’ అంటే మంజూరు చేసిన ఫండ్ ఆధారిత మరియు నాన్-ఫండ్ ఆధారిత క్రెడిట్ సౌకర్యాల మొత్తం |