RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78520507

ఆర్డ్‌నన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీ ప్రారంభిక్ సహకారి
బ్యాంక్ లి., కాన్‌పూర్, (యు పి) - జరిమానా విధింపు

తేదీ:31/05/2019

ఆర్డ్‌నన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీ ప్రారంభిక్ సహకారి
బ్యాంక్ లి., కాన్‌పూర్, (యు పి) - జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47A (1)(c) [సెక్షన్‌ 46 (4) తో కలిపి] క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆర్డ్‌నన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీ ప్రారంభిక్ సహకారి బ్యాంకు లి., కాన్‌పూర్, (యు పి) పై, రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయిలు) నగదు జరిమానా విధించినది. ఇంటర్-బ్యాంక్ గ్రాస్ అండ్ కౌంటర్‌ పార్టీ ఎక్స్పోజర్ పరిమితులు మరియు పరపతి సమాచార కంపెనీలలో సభ్యత్వానికి సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు, మార్గదర్శకాలు ఉల్లంఘించిన కారణంగా, ఈ జరిమానా విధించబడింది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్, పైన పేర్కొన్న బ్యాంకుకు, షోకాజ్ నోటీస్ జారీ చేసినది. దీనికి బ్యాంక్ ఎట్టి వ్రాతపూర్వక జవాబు ఇవ్వలేదు. ఈ విషయమై నిజానిజాలు, పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేననీ, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2828

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?