<font face="mangal" size="3">నగదు నిర్వహణ కు ఒప్పంద సేవలు(అవుట్సోర్సింగ్ - ఆర్బిఐ - Reserve Bank of India
నగదు నిర్వహణ కు ఒప్పంద సేవలు(అవుట్సోర్సింగ్) - లావాదేవీల సమన్వయం (రికన్సిలియేషన్)
ఆర్.బి.ఐ/2018-19/183 మే 14, 2019 అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకుడు/ మేడమ్/ డియర్ సర్, నగదు నిర్వహణ కు ఒప్పంద సేవలు(అవుట్సోర్సింగ్) - లావాదేవీల సమన్వయం (రికన్సిలియేషన్) అక్టోబర్ 04, 2016 వ తేదీ నాటి ద్రవ్య విధాన ప్రకటన యందలి పేరా 15 నందు ఉద్ఘాటించినట్లు, ఖజానా బట్వాడా పరిగమనంలో ఇమిడియున్న సమస్త భద్రతా అంశాలను సమీక్షించుటకై ఆర్బీఐ ‘నగదు రవాణా మీద కమిటీ’ (శ్రీ డి.కె.మొహంతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అధ్యక్షతన) వొకదానిని నియమించింది. బ్యాంకులు, సేవా ప్రదాతలు మరియు వారి సబ్-కాంట్రాక్టర్లు మధ్య సకాలంలో లావాదేవి లు సమన్వయo (అనగా ఏటియం ల వద్ద నగదు భర్తీ విషయంలో) అనే దానిగురించి ఈ కమిటీ సిఫార్సులను పరిశీలించడం జరిగింది. తదనుగుణంగా, బ్యాంకులు ఈ క్రింది ప్రొసీజర్ ను అనుసరించితీరాలని నిర్ణయించబడింది: అ) కరెన్సీ చెస్ట్/నోడల్ బ్రాంచి లతో సంప్రదింపులు జరిపి సేవా ప్రదాతలు నగదు ధర్ఖాస్తు (ఇండెంట్) లను వొక దినం (T + 1 ఇక్కడ T అంటే నగదు లోడ్ చేసే రోజు) ముందుగా పంపాలి. పలుమార్లు నగదు ఉపసంహరణకు తావులేకుండునట్లు సెంటర్ ప్రతిదానికీ ఒక చోటకు మాత్రమే పరిమితమవ్వాలి. అయితే మెట్రోపాలిటన్ నగరాలలో మాత్రం రెండుచోట్లలో నగదు ను ఉపసంహరణ చేయ్యొచ్చు. ఆ) బ్యాంకులు, సేవా ప్రదాతలు మరియు వారి సబ్-కాంట్రాక్టర్లు మధ్య లావాదేవిల సమన్వయo (రికన్సిలియేషన్) కనీసం T + 3 బేసిస్ లోనన్నా జరగాలి. ఇ) ఒకవేళ భద్రతకు భగ్నం వాటిల్లినా లేదా నిర్దేశించిన విధివిధానాల మీద వివాదం లేదా రిపోర్టింగ్ జరిగితే, సేవా ప్రదాతలు మరియు వారి సబ్-కాంట్రాక్టర్లు అడిగినచో నిఘా నేత్రాల కవరేజి ఫూటేజ్ ను బ్యాంకులు వారికి అందజేయవచ్చు. 2. అంతేగాకుండా, నగదు నిర్వహణ ఒప్పందసేవల (అవుట్సోర్సింగ్) వ్యవస్థ లో అంతర్భాగం గా : అ) డేటా సమన్వయానికి మరియు డేటా పునర్లభ్యత కు డిజిటల్ రికార్డుల సమర్ధ నిర్వహణను ప్రవేశపెట్టేందుకు; ఆ) స్వతంత్ర నియంత్రణ సంస్థ చే ఏదైనా వొక ప్రత్యేక కోడ్ లేదా గుర్తింపు కోడ్ ద్వారా ఉద్యోగులు సమర్ధులు మరియు మచ్చలేని రికార్డు కలిగి ఉన్నారని నిర్ధారించడానికి పరిశ్రమ స్థాయిలో ఉద్యోగుల డేటా బేస్ సృష్టి మరియు నిర్వాహణకై ; బ్యాంకులు వారి వారి సేవా ప్రదాతలను మరియు వారి సబ్-కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలి. మీ విధేయులు (సంజయ్ కుమార్) |