<font face="Mangal" size="3">ఆదాయ పన్ను బకాయిలు రిజర్వ్‌ బ్యాంక్ లో గాని,  - ఆర్బిఐ - Reserve Bank of India
ఆదాయ పన్ను బకాయిలు రిజర్వ్ బ్యాంక్ లో గాని, అధికృత బ్యాంక్ శాఖల్లో గానీ ముందుగానే గాని చెల్లించండి
నవంబర్ 13, 2015 ఆదాయ పన్ను బకాయిలు రిజర్వ్ బ్యాంక్ లో గాని, అధికృత బ్యాంక్ శాఖల్లో గానీ ముందుగానే గాని చెల్లించండి భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆదాయ పన్ను చెల్లింపుదారులను, వారి ఆదాయపు పన్ను బకాయిలను, గడువు తేదీకి మరింత ముందుగానే చెల్లించవలెనని విజ్ఞప్తి చేసింది. ఇంకా, పన్ను చెల్లింపుదారులు, ఎంపిక చేసిన ప్రాతినిధ్య బ్యాంకులు, లేదా వారు అందించే ఆన్లైన్ సదుపాయంవంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఉపయోగిం చుకోవాలని సూచించింది. దీని వల్ల, రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల వద్ద బారులు తీరే అవసరం ఉండదు. ప్రత్యేకించి, డిసెంబర్ చివరలో, పన్ను చెల్లించడానికి విపరీతమైన రద్దీ దృష్ట్యా, వీలయినంతమేరకు అదనపు కౌంటర్లు తెరిచినా, రశీదులు జారీ చేయడానికి, ఒత్తిడి ఎదురుకోవడం కష్టతరమౌతోంది. అదాయపు పన్ను బకాయిలు స్వీకరించడానికి, ఈ క్రింది ఇరవైతొమ్మిది ప్రాతినిధ్య బ్యాంకులకు అధికారం ఇవ్వబడింది:
అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2015-2016/1142 |