<font face="mangal" size="3px">ఐటీ బకాయిల‌ను RBI లేదా అధీకృత బ్యాంకు శాఖ‌ల‌లో & - ఆర్బిఐ - Reserve Bank of India
ఐటీ బకాయిలను RBI లేదా అధీకృత బ్యాంకు శాఖలలో ముందస్తుగా చెల్లించండి - డిసెంబర్ 2016
నవంబర్ 02, 2016 ఐటీ బకాయిలను RBI లేదా అధీకృత బ్యాంకు శాఖలలో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేవారు గడువుకు తగినంత ముందుగానే తమ ఆదాయ పన్ను బకాయీలను చెల్లించమని RBI విజ్ఞప్తి చేసింది. అంతే కాకుండా ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేవారు ఏజెన్సీ బ్యాంకుల ప్రత్యేక శాఖలు లేదా ఆ బ్యాంకులు అందిస్తున్న ఆన్ లైన్ చెల్లింపుల సౌకర్యాన్ని వినియోగించుకోవడం లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. దీని వల్ల వారు రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల వద్ద పొడవైన క్యూలలో నిలబడే అసౌకర్యం తగ్గుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల చివరి వారంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఆదాయ పన్ను బకాయీలను చెల్లించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతోందని గమనించడం జరిగింది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ రిసీప్ట్ లను జారీ చేయడంలో తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటోంది. చాలా బ్యాంకులు ఆన్ లైన్ లో ఆదాయ పన్నును చెల్లించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాయి. ఇరవై తొమ్మిది ఏజెన్సీ బ్యాంకులు ఆదాయ పన్ను బకాయీ చెల్లింపులు స్వీకరించడానికి అధికారాన్ని కలిగి ఉన్నాయి. అవి: 1. అలహాబాద్ బ్యాంక్ అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్ : 2016-17/1087 |