<font face="mangal" size="3">ఆదాయ పన్ను బకాయిలు ముందస్తుగా భారతీయ రిజర్వ - ఆర్బిఐ - Reserve Bank of India
ఆదాయ పన్ను బకాయిలు ముందస్తుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లోగాని లేదా అధికృత బ్యాంక్ శాఖల్లోగాని చెల్లించండి – జూన్ 2017
తేదీ: మే 15, 2017 ఆదాయ పన్ను బకాయిలు ముందస్తుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లోగాని లేదా అధికృత బ్యాంక్ శాఖల్లోగాని చెల్లించండి – జూన్ 2017 ఆదాయ పన్ను బకాయిలు చెల్లించడానికి, రిజర్వ్ బ్యాంక్‌లో సాధ్యమయినంతమేరకు అదనపు కౌంటర్లు తెరిచినా, జూన్ నెల చివరిలో విపరీతమైన రద్దీ ఉంటోందని గమనించడం జరిగింది. దీనివల్ల జనం ఎంతో సమయం వరుసలో వేచి ఉండడం తప్పనిసరి అవుతోంది. ఈ అసౌకర్యాన్ని నివారించడంకోసం, పన్ను చెల్లించేవారు ఆఖరి నిమిషం వరకు వేచి ఉండకుండా, గడువు తేదీకి వీలయినంత ముందే ఆదాయ పన్ను చెల్లించాలని సూచన. ఇంతేగాక, ముంబైలో ఈక్రింద సూచించిన, ఎంపికచేసిన అధికృత ప్రాతినిధ్య బ్యాంక్ శాఖలు (Branches of Accredited Agency Banks), ఆదాయ పన్ను బకాయిలు స్వీకరించడానికి అనుమతించబడ్డాయి. వీటిలో చాలా బ్యాంకులు, పన్నులు 'ఆన్‌లైన్‌లో’ (on-line) చెల్లించడానికి సదుపాయం కల్పిస్తున్నాయి. పన్ను చెల్లించేవారు, వారి సౌకర్యంకోసం ఈ ఏర్పాట్లను వినియోగించుకోవచ్చు.
అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/3068 |