<font face="mangal" size="3">శ‌నివారం, న‌వంబ‌ర్ 12 మ‌రియు ఆదివారం, న‌వంబ‌ర్ 13, 20 - ఆర్బిఐ - Reserve Bank of India
శనివారం, నవంబర్ 12 మరియు ఆదివారం, నవంబర్ 13, 2016 రోజులలో పని చేయనున్న చెల్లింపు వ్యవస్థలు (RTGS, NEFT, చెక్ క్లియరింగ్, రెపో, CBLO మరియు కాల్ మార్కెట్లు)
RBI/2016-17/116 నవంబర్ 10, 2016 ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డియర్ సర్, శనివారం, నవంబర్ 12 మరియు ఆదివారం, నవంబర్ 13, 2016 రోజులలో పని చేయనున్న చెల్లింపు వ్యవస్థలు (RTGS, NEFT, చెక్ క్లియరింగ్, రెపో, CBLO మరియు కాల్ మార్కెట్లు) బ్యాంకులు ప్రజల నిమిత్తం శనివారం, నవంబర్ 12 మరియు ఆదివారం, నవంబర్ 13, 2016 న పని చేయనున్న నేపథ్యంలో చెల్లింపుల వ్యవస్థలు (RTGS, NEFT, చెక్ క్లియరింగ్, రెపో, CBLO మరియు కాల్ మార్కెట్లు) కూడా నవంబర్ 12 మరియు ఆదివారం, నవంబర్ 13, 2016న పని చేయాలని నిర్ణయించడమైనది. భాగస్వాములు అందరు /సభ్య బ్యాంకులన్నీ తమ ఖాతాదారులు ఇతర పనిదినాలలో లాగే నవంబర్ 12 మరియు నవంబర్ 13, 2016న కూడా పైన పేర్కొన్న చెల్లింపు వ్యవస్థల కార్యకలాపాలు నిర్వహించుకునేలా చూడాలని సూచించడమైనది. ఈ రెండు రోజులలో కూడా చెల్లింపు వ్యవస్థలు పని చేస్తాయనే విష యానికి తగిన ప్రచారం కల్పించాలి. మీ విశ్వసనీయులు, (నంద ఎస్. దవే) |