<font face="mangal" size="3">ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన – MoA&FW పోర్టల్‌లో ప& - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన – MoA&FW పోర్టల్లో పంట బీమా వివరాలు నమోదు చెయ్యడంలో బ్యాంకుల వైఫల్యం.
RBI/2016-17/41 ఆగస్ట్ 25, 2016 చైర్మన్/ మేనేజింగ్ డైరెక్టర్/ అయ్యా/అమ్మా, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన – MoA&FW పోర్టల్లో పంట బీమా వివరాలు నమోదు చెయ్యడంలో బ్యాంకుల వైఫల్యం. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) నిబంధనలని ఖచ్చితంగా అమలు పరచాలని, పథకం యొక్క ఆశయాలు, లక్ష్యాలు సాధించడానికి తోడ్పడేలా, నిర్వచించిన వ్యవసాయ రుణాలు తీసుకొన్న/తీసుకోని ఇతర వ్యవసాయదారుల వివరాలు 100% సేకరించాలని సూచిస్తూ, మేము జారీ చేసిన సర్క్యులర్ FIDD No.FSD.BC20/05.10.007/2015-16 తేదీ మార్చ్ 17, 2016, దయచేసి చూడండి. 2. భారత ప్రభుత్వం యొక్క PMFBY, నిర్వహణ మార్గదర్శకాలకు అనుగుణంగా, బ్యాంకులు పంట బీమా వినియోగించుకొంటున్న అందరు వ్యవసాయదారుల (రుణం తీసుకొన్న/ తీసుకోని) భూమి/పంట వివరాలు, వారి శాఖలనుండి సేకరించవలసి ఉంది. 3. వ్యవసాయ, వ్యవసాయదారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Agriculture & farmers Welfare), పంట బీమాకై ఏకీకృతంచేసిన పోర్టల్ – www.agriinsurance.gov.in. లో వ్యవసాయదారుల వివరాలు నమోదు చేయవలసిందిగా అన్ని బ్యాంకులకు సూచించింది. అయితే, బ్యాంకు శాఖలు ఈ పోర్టల్లో వివరాలు నమోదు చేయడం లేదని మాదృష్టికి వచ్చింది. ఈ కారణంగా MoW&FW, రాష్ట్ర ప్రభుత్వాలు మొదలైనవారు, బీమా చేయబడిన పంటలు, వసూలు చేసిన ప్రీమియమ్ మొ.వి అంచనా వేయడంలో, కష్ట పడవలసి వస్తోంది. అందువల్ల, మీ శాఖలకు పై వివరాలు, ఈ పోర్టల్లో నమోదు చేయవలసినదిగా సత్వరం ఆదేశాలు జారీచేయవలెను. విధేయులు, (ఉమా శంకర్) |