RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78492889

ప్ర‌గ‌తి కోఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌, బెంగ‌లూరు, క‌ర్ణాట‌క‌- జ‌రిమానా విధింపు

మార్చి 29, 2017

ప్ర‌గ‌తి కోఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌, బెంగ‌లూరు, క‌ర్ణాట‌క‌- జ‌రిమానా విధింపు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 47 A (1) (b) రెడ్ విత్ సెక్షన్ 46(4) (సహకార సంఘాల‌కు వర్తించే) ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి - గృహ‌రుణాలు, రియ‌ల్ ఎస్టేట్‌, వాణిజ్య రియ‌ల్ ఎస్టేట్ రంగం విష‌యంలో; ఖాతాదారుల రిస్క్ క్యాట‌గెరైజేష‌న్‌/రిస్క్ ప్రొఫైలింగ్ విష‌యంలో మ‌రియు పాత అకౌంట్ల‌ను అప్ డేట్ చేసే విష‌యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ విధించిన నియ‌మనిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించినందుకు గాను కర్ణాటకలోని బెంగలూరులో ఉన్న ప్రగతి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు రూ.50,000 (యాభై వేల రూపాయ‌లు) జ‌రిమానాను విధించ‌డం జ‌రిగింది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆ బ్యాంకుకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, దానికి ఆ బ్యాంకు వ్య‌క్తిగ‌త వివ‌ర‌ణ ఇస్తామ‌ని తెలియ‌జేయ‌డంతో పాటు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ కేసులోని వాస్తవాలను, బ్యాంకు ఇచ్చిన జవాబును పరిశీలించిన పిమ్మట, ఆ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణకు వచ్చిన రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.

అనిరుధ డి.జాద‌వ్
స‌హాయ మేనేజ‌ర్‌

ప్రెస్ రిలీజ్: 2016-17/2601

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?