<font face="mangal" size="3">ప్రీ-షిప్మెంట్ మరియు పోస్ట్-షిప్మెంట్ ఎగుమత - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రీ-షిప్మెంట్ మరియు పోస్ట్-షిప్మెంట్ ఎగుమతి క్రెడిట్ - అడ్వాన్స్ కాలం యొక్క పొడిగింపు
ఆర్‌బిఐ/2019-20/246 మే 23, 2020 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ఆర్‌ఆర్‌బిలను మినహాయించి) మేడమ్/ప్రియమైన సర్, ప్రీ-షిప్మెంట్ మరియు పోస్ట్-షిప్మెంట్ ఎగుమతి క్రెడిట్ - అడ్వాన్స్ కాలం యొక్క పొడిగింపు 'రూపాయి/విదేశీ కరెన్సీ ఎగుమతి క్రెడిట్ మరియు ఎగుమతిదారులకు వినియోగదారుల సేవ' పై జూలై 1, 2015 న జారీచేసిన మాస్టర్ సర్క్యులర్ DBR.No.DIR.BC.14/04.02.002/2015-16 మరియు ఈ విషయం ఫై ఇతర సర్క్యులర్లు చూడండి. 2. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా, ఎగుమతిదారులు ఉత్తరువులలో జాప్యం/ వాయిదాలు ఎగుమతి ఆదాయం తిరిగి రాబట్టుకోవడంలో ఆలస్యం వంటి నిజమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో, ఆర్బిఐ ఇప్పటికే జూలై 31, 2020 వరకు చేసిన ఎగుమతులకు సంబంధించి స్వదేశానికి ఎగుమతి ఆదాయం తిరిగి రాబట్టుకోవడానికి తొమ్మిది నెలల నుండి 15 నెలల వరకు అనుమతించింది. ఈ సడలింపుకు అనుగుణంగా, బ్యాంకుల ద్వారా జూలై 31, 2020 వరకు మంజూరు చేయబడిన ప్రీ-షిప్మెంట్ మరియు పోస్ట్-షిప్మెంట్ ఎగుమతి క్రెడిట్ కొరకు అనుమతింపబడిన గరిష్ట వ్యవధిని, ఒక సంవత్సరం నుండి 15 నెలలకు పెంచాలని నిర్ణయించడమైనది. మీ విధేయులు, (డాక్టర్ ఎస్. కె. కర్) 1అధీకృత డీలర్ల కేటగిరీ I లైసెన్స్ కలిగి ఉన్న షెడ్యూల్డ్ బ్యాంకులు |