RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78509902

ప్రాధాన్యరంగ రుణాలు (పి ఎస్ ఎల్)-ప్రాధాన్య రంగాలలో ఎగుమతుల వర్గీకరణ

RBI/2019-20/66
FIDD.CO.Plan.BC.12/04.09.01/2019-20

సెప్టెంబర్ 20, 2019

చైర్‌మన్‌ / మానేజింగ్ డైరెక్టర్ / సి ఇ ఒలు
చిన్న ఫైనాన్స్ బ్యాంకులతోసహా, అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా)

అమ్మా / అయ్యా,

ప్రాధాన్యరంగ రుణాలు (పి ఎస్ ఎల్)-ప్రాధాన్య రంగాలలో ఎగుమతుల వర్గీకరణ

ఎగుమతి రంగానికి రుణ సౌకర్యాలు అధికంచేయడానికి, ప్రాధాన్య రంగ రుణాల లక్ష్యాలు మరియు వర్గీకరణపై జులై 7, 2016 తేదీన జారీచేసిన (డిసెంబర్ 4, 2018 తేదీన నవీకరించబడిన) మాస్టర్ డైరెక్షన్‌, పేరాగ్రాఫ్ 8 లో ఈక్రింద పేర్కొన్న మార్పులు చేయాలని నిర్ణయించడం జరిగింది-

  1. ప్రాధాన్య రంగాలలో ఎగుమతి రుణాలకు గల పరిమితి, ప్రతి రుణ గ్రహీతకు, రూ. 250 మిలియన్ల నుండి రూ. 400 మిలియన్లకు పెంచుట

  2. ప్రస్తుతంగల 'రూ 1 బిలియన్‌ టర్న్‌ఓవర్ కలిగి ఉండవలెను' - అన్న నిబంధన తొలగించుట.

2. ప్రస్తుతం దేశీయ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు వర్తించే - 'మునుపటి సంవత్సరం ఇదే తేదీనాటికి, నేటికి పెరిగిన ఎగుమతి రుణాలు, ANBC పై 2% లేక ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్‌యొక్క క్రెడిట్ ఈక్వివలెంట్ మొత్తం, ఏది ఎక్కువ ఉంటే అది, ప్రాధాన్య రంగ రుణాలుగా వర్గీకరించవలెను'- అన్న మార్గదర్శకాలు, పైన (i) లో తెలిపిన ప్రమాణాలకు లోబడి, అమలులో కొనసాగుతాయి.

3. విదేశీ బ్యాంకులకు సంబంధించి, ప్రస్తుత ఆదేశాలలో ఎట్టి మార్పూ లేదు.

మీ విశ్వాసపాత్రులు,

(గౌతం ప్రసాద్ బోరా)
చీఫ్ జనరల్ మానేజర్-ఇన్‌-చార్జ్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?