<font face="mangal" size="3">ప్రాధాన్యత రంగ రుణాలు (పిఎస్ఎల్) - చిన్న ఫైనాన& - ఆర్‌బిఐ - Reserve Bank of India
ప్రాధాన్యత రంగ రుణాలు (పిఎస్ఎల్) - చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బిలు) ఎన్‌బిఎఫ్‌సి-ఎంఎఫ్‌ఐలకు రుణాలు ఇవ్వడం
ఆర్‌బిఐ/2021-22/27 మే 5, 2021 అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకుడు/ముఖ్య కార్యనిర్వహణ అధికారి మేడమ్/ప్రియమైన సర్, ప్రాధాన్యత రంగ రుణాలు (పిఎస్ఎల్) - చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బిలు) ఎన్‌బిఎఫ్‌సి-ఎంఎఫ్‌ఐలకు రుణాలు ఇవ్వడం ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బిలు) సూక్ష్మ ఆర్ధిక సంస్థలు (ఎంఎఫ్ఐ) ఇచ్చే రుణాలు ఆన్-లెండింగ్ కోసం ఇవ్వడం ప్రాధాన్యత రంగ రుణ (పిఎస్ఎల్) వర్గీకరణ క్రింద లెక్కించబడదు. కోవిడ్-19 మహమ్మారి తీసుకువచ్చిన తాజా సవాళ్ళ దృష్ట్యా మరియు చిన్న ఎంఎఫ్ఐల యొక్క ఉద్భవిస్తున్న ద్రవ్య స్థితిని పరిష్కరించడానికి, ఎస్‌ఎఫ్‌బిలు విస్తరించిన తాజా రుణాలకు పిఎస్ఎల్ వర్గీకరణను, ఆర్‌బిఐచే గుర్తించబడిన 'సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్' లో సభ్యులుగా వున్న మరియు మార్చి 20, 2021 నాటికి ₹ 500 కోట్ల వరకు 'స్థూల రుణ పోర్ట్‌ఫోలియో’ కలిగిన రిజిస్టర్డ్ ఎన్‌బిఎఫ్‌సిలు మరియు ఇతర ఎంఎఫ్ఐలకు (సొసైటీలు/ట్రస్ట్‌లు మొదలైనవి), వ్యక్తులకు రుణాలు ఇవ్వడం కోసం అనుమతించాలని నిర్ణయించడమైనది. పైన పేర్కొన్న విధంగా బ్యాంక్ క్రెడిట్ మార్చి 31, 2021 నాటికి బ్యాంక్ మొత్తం ప్రాధాన్యతా రంగ పోర్ట్‌ఫోలియోలో 10% వరకు అనుమతించబడుతుంది. 2. పైన పేర్కొన్న వెసులుబాటు మార్చి 31, 2022 వరకు అమలులో ఉంటుంది. అయినప్పటికీ, పంపిణీ చేయబడిన రుణాలు తిరిగి చెల్లించే/పరిపక్వత తేదీ, ఏది ముందు ఐతే అది, ప్రాతిపదికన ప్రాధాన్యత రంగం క్రింద వర్గీకరించబడతాయి. ఇంకా, సెప్టెంబరు 4, 2020 నాటి పిఎస్‌ఎల్‌పై మా మాస్టర్ డైరెక్షన్‌ల పేరా 21 క్రింద ఆన్-లెండింగ్ కోసం సూచించిన షరతులకు బ్యాంకులు కట్టుబడి ఉండాలి (ఏప్రిల్ 29, 2021 నాటికి నవీకరించబడింది). 3. ఈ సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుండి మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి. మీ విధేయులు (సోనాలి సేన్ గుప్తా) |