<font face="mangal" size="3">ఫ్యాక్టరింగ్ లావాదేవీలకు ప్రాధాన్య రంగ రుణ - ఆర్బిఐ - Reserve Bank of India
ఫ్యాక్టరింగ్ లావాదేవీలకు ప్రాధాన్య రంగ రుణాల హోదా
RBI/2016-17/37 ఆగస్ట్ 11, 2016 చైర్‌మన్/ మేనేజింగ్ డైరెక్టర్/ అయ్యా/అమ్మా, ఫ్యాక్టరింగ్ లావాదేవీలకు ప్రాధాన్య రంగ రుణాల హోదా ప్రాధాన్యరంగ రుణాలపై (PSL) రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన మాస్టర్ డైరెక్షన్ FIDD.CO.Plan.1/04.09.01/2016-17 తేదీ జులై 7, 2016 మరియు ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టం ఏర్పాటు/నిర్వహణపై (TReDS) డిసెంబర్ 3, 2014 తేదీన జారీచేసిన మార్గదర్శకాలు దయచేసి చూడండి. 2. MSME రంగానికి ద్రవ్య లభ్యత అధికం చేసేందుకు, శాఖా పరంగా ఫ్యాక్టరింగ్ లావాదేవీలు (Factoring Transactions) జరుపుతున్న బ్యాంకులు 'విత్ రికోర్స్' ప్రాతిపదికన (with recourse basis) ఫాక్టరింగ్ చేసిన లావాదేవీలు, ప్రాధాన్య రంగ రుణాలుగా వర్గీకరించడానికి అర్హమౌతాయని నిర్ణయించడం జరిగింది. 3. PSL పై జారీచేసిన మాస్టర్ డైరెక్షన్ పేరాగ్రాఫ్ 7 చాప్టర్ (III) ప్రకారం, అసైనర్ (assignor) సూక్ష్మ, చిన్నలేక మధ్యమ సంస్థలయి ఉంటే, రిపోర్టింగ్ తేదీలలో బకాయి ఉన్న ఫ్యాక్టరింగ్ పోర్ట్‌ఫోలియోని బ్యాంకులు, MSMEగా వర్గీకరించవచ్చు (ప్లాంట్, మషినరీ/ఇతర పరికరాలలో, పెట్టుబడిపై, ప్రాధాన్య రంగ రుణ వర్గీకరణ మార్గదర్శకాలలో సూచించిన పరిమితులమేరకు) 4. ఈ సందర్భంగా, 'బ్యాంకులచే ఫ్యాక్టరింగ్ సర్వీసుల ఏర్పాటు -సమీక్ష' (Provision of Factoring Services by Banks-Review) పై, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ సర్క్యులర్ DBR.No.FSD.BC.32/24/01.007/2015-16 తేదీ జులై 30, 2015 పారాగ్రాఫ్ 9 ప్రకారం, బ్యాంకులు రుణ గ్రహీతలనుండి, ఫ్యాక్టర్‌డ్ రిసీవబుల్స్ (factored receivables) గురించి, నియమిత కాల అవధుల్లో, ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలని మరల సూచిస్తున్నాము. (రెండుమార్లు లెక్కించి, ద్విగుణంగా రుణ జారీ నివారించడానికి) ఇంతేగాక, ఫ్యాక్టర్లు, రుణగ్రహీతకు అనుమతించిన పరిమితులు, ఫ్యాక్టర్ చేసిన రుణాల వివరాలు, బ్యాంకులకు తెలియబరి చేలా రూఢి చేసుకోవాలి. రెండుమార్లు చెల్లింపులు జరగవని బాధ్యతకూడా వహించాలి. విధేయులు, (ఏ. ఉద్గట) |