<font face="Mangal" size="3px">ప్రాధాన్య‌తా రంగాల‌కు రుణాలు – లక్ష్యాలు మర - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రాధాన్యతా రంగాలకు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ
RBI/2015-16/132 జులై 16, 2015 అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకులు మాడమ్/డియర్ సర్, ప్రాధాన్యతా రంగాలకు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ దయచేసి జులై 1, 2015 నాటి మా మాస్టర్ సర్క్యులర్ సంఖ్య FIDD.CO.Plan.BC.04/ 04.09.01/2015-16 ను, పైన పేర్కొన్న విషయంపై చూడండి. 2. ప్రాధాన్యతా రంగాల నిబంధనల క్రింద వ్యవసాయానికి నేరుగా ఇచ్చే రుణాలు, రైతులకు సులభతరమైన ప్రత్యక్ష రుణాల పెంపుదల కొరకు ఉద్దేశింపబడినవి. అననుకూల రైతులకు (చిన్న, మధ్యతరహా) నేరుగా ఇచ్చే రుణాలు సాధారణంగా సర్దుబాటు చేసిన నెట్ బ్యాంక్ క్రెడిట్ (లేదా ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ యొక్క క్రెడిట్ కు సమాన మొత్తం; ఏది ఎక్కువైతే అది), లో 6% గా ఉంది. వ్యవసాయానికి ఇచ్చే ప్రత్యక్ష రుణాలు, ఇటీవలే సవరించిన ప్రాధాన్యతా రంగాల నిబంధనల క్రింద చిన్న, మధ్యతరహా రైతుల ప్రత్యక్ష రుణాల లక్ష్యం, 2015-16 సంవత్సరానికి 7% మరియు 2016-17 సంవత్సరానికి 8% కి పెంచడమైనది. అంతేకాకుండా, వివిధ రకాల సంఘటిత (corporate) రుణాలు, ప్రత్యక్ష రుణ స్థితిని పొందకుండా మినహాయించబడ్డాయి. మధ్యతరహా మరియు పెద్దతరహా రైతులతో సహా, వ్యవసాయానికి ఇచ్చే ప్రత్యక్ష రుణాలు మొత్తం ఈ పద్దతిలో పెరుగుతాయి. 3. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ సంబంధిత సమస్యల పరిస్థితుల్లో, రైతులకు ఇచ్చే ప్రత్యక్ష రుణాల తగ్గింపు, ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ప్రభుత్వం ఆందోళన వెల్లడించింది. అసంఘటిత (non-corporate) రైతులకు వారి ప్రత్యక్ష రుణాలు మొత్తం, గత మూడు సంవత్సరాలుగా సాధించిన వ్యవస్థ విస్తృత సగటు కంటే తక్కువగా ఉండకూడదు (దీని గురించి యధా సమయం లో తెలియచేయబడును మరియు తరువాత ప్రతి సంవత్సరం ప్రారంభంలో). అలా చేయని పక్షంలో బ్యాంకులు జరిమానాలు చెల్లించవలసి ఉంటుంది. ఇంతకుముందు ప్రత్యక్ష వ్యవసాయ రంగంలో ఉన్న లబ్ధిదారులు 13.5% ప్రత్యక్ష రుణాల స్థాయిని చేరుకోవడానికి బ్యాంకులు అన్ని ప్రయత్నాలను కొనసాగించాలి. మీ విధేయులు, (ఎ. ఉద్గాత) |