<font face="mangal" size="3">ప్రాధాన్యతా రంగాలకు రుణాలు – లక్ష్యాలు మరియ - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రాధాన్యతా రంగాలకు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ
ఆర్.బి.ఐ/2017-18/135 మార్చి 01, 2018 చైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓలు డియర్ సర్ / మేడమ్, ప్రాధాన్యతా రంగాలకు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ దయచేసి ఏప్రిల్ 23, 2015 తెదీ సర్కులర్ నం. యఫ్.ఐ.డి.డి./ సీ.ఓ. ప్లాన్. బీసీ.54/04.09.01/2014-15 ద్వారా బ్యాంకులకు జారీ చేయబడిన సవరించిన ప్రాధాన్యతా రంగాల మార్గదర్శకాలను పరిశీలించవలసినది. ఇరవై గాని అంతకు మించి గాని బ్రాంచిలను కలిగియున్న విదేశీ బ్యాంకులకు పైన పేర్కొన్న సర్కులర్ లోని పేరా (II) (i) ప్రకారం, సన్నకారు మరియు చిన్నకారు రైతులు మఱియు సూక్ష్మ సంస్థలకు నిర్దేశించబడిన ఋణాల ఉప లక్ష్యాలు (సబ్-టార్గెట్స్) 2017 వ సంవత్సరoలో సమీక్ష తర్వాత, 2018 నుండి వర్తిస్తాయని నిర్దేసించబడింది.. 2. తదనుగుణంగా, పైన పేర్కొన్న బ్యాంకులు వారు ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చిన ఋణాల అర్ధచిత్రాన్ని సమీక్షించిన అనంతరం మరియు బ్యాంకుల మధ్య సమానావకాశాలను కల్పించే దిశలో, ఇరవై గాని అంతకు మించి గాని బ్రాంచిలను కలిగియున్న విదేశీ బ్యాంకులకు, సన్నకారు మరియు చిన్నకారు రైతులకు నిర్దేశించబడిన ఋణాల ఉప లక్ష్యం అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ (ANBC) లేదా క్రెడిట్ ఈక్వివేలేంట్ ఆఫ్ ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్ష్పొజరు (CEOBE) లలో 8 (ఎనిమిది) శాతంగా ఏదైతే ఎక్కువవో అది, ఆర్దిక సంవత్సరం 2018-19 నుండి వర్తిసుందని నిర్ణయించడం జరిగింది. ఇంకా, ఇరవై గాని అంతకు మించి గాని బ్రాంచిలను కలిగియున్న విదేశీ బ్యాంకులకు, వారు సూక్ష్మ సంస్థలకు నిర్దేశించబడిన ఋణాల ఉప లక్ష్యం అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ (ANBC) లేదా క్రెడిట్ ఈక్వివేలేంట్ ఆఫ్ ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్ష్పొజరు (CEOBE) లలో 7.5 శాతంగా ఏదైతే ఎక్కువవో అది, కూడా ఆర్దిక సంవత్సరం 2018-19 నుండి వర్తిసుంది. 3. ఇంతేగాకుండా, వివిధ స్టేక్ హోల్డర్స్ నుంచి అందిన పునశ్చరణం (ఫీడ్-బ్యాక్) మేరకు మరియు ఆర్దిక వ్యవస్థలో సేవా రంగం ప్రాధాన్యత పెరిగిన దృష్ట్యా, ప్రాధాన్యతా రంగాల క్రింద వర్గీకరణ కోసం సూక్ష్మ మఱియు చిన్నమరియు మధ్యస్థమైన సంస్థల (సేవలు) (MSME) కు సంబంధించి లబ్దిదారు ఒక్కింటికి ప్రస్తుతం వర్తిస్తున్న రుణ పరిమితులు వరుసగా ₹ 5 కోట్లు మరియు ₹ 10 కోట్లు ను తొలగించాలని నిర్ణయించబడింది. తదనుగుణంగా, MSMED Act, 2006 లో ఇక్విప్ మెంట్ క్రింద పెట్టుబడి పరంగా నిర్వచించబడిన విధంగా, సేవలను సమకూర్చడం లేదా అందించడం లో నిమగ్నమైన MSME లకు ఇవ్వబడిన అన్ని బ్యాంకు రుణాలు ఎటువంటి పరిమితి(క్యాప్) లేకుండా, ప్రాధాన్యతా రంగం క్రిందకు అర్హం అవుతాయి. మీ విధేయులు (గౌతం ప్రసాద్ బోరా) |