RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78523588

ప్రాధాన్యతా రంగాలకు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ

ఆర్.బి.ఐ/2018-19/179
యఫ్.ఐ.డి.డి./సీ.ఓ.ప్లాన్.బీసీ.18/04.09.01/2018-19.

మే 06, 2019

ది చైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ
అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు/అన్ని చిన్న ఋణ (స్మాల్ ఫైనాన్స్) బ్యాంకులు

డియర్ సర్ / మేడమ్,

ప్రాధాన్యతా రంగాలకు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ

దయచేసి, ప్రాధాన్యతా రంగం వర్గీకరణ కోసం గృహ రుణాల అర్హతా ప్రమాణాలను సూచించు ఏప్రిల్ 04, 2019 వ తెదీ నాటి మొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదిక 2019-20 సంబందిత అభివృద్ధి మరియు నియంత్రణ విధాన ప్రకటన లోని పేరా 10 మరియు జులై 7, 2016 వ తేదీ నాటి ప్రత్యెక నిర్దేశం (మాస్టర్ డైరెక్షన్) – ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్.ఆర్.బి లు) - ప్రాధాన్యతా రంగాలకు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ లోని పేరా 9/ జులై 6, 2017 వ తేదీ నాటి చిన్న ఋణ బ్యాంకుల కోసం సంక్షిప్తసంకలనం (కంపెన్డియం) - ప్రాధాన్యతా రంగాలకు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ లోని పేరా 5 లను చూడండి.

2. పైన పేర్కొన్న ప్రధాన నిర్దేశం (మాస్టర్ డైరెక్షన్) ప్రకారం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్.ఆర్.బీలు) వ్యక్తులకిచ్చే ఋణాలు - కుటుంబంఒక్కోదానికి నివాస గృహం కొనటానికి/నిర్మాణంనకు 20 లక్షలవరకు నివాసగృహం క్రింద మొత్తం ఖర్చు 25 లక్షలకు మించకుండా ఉన్నట్లయితే - ప్రాధాన్యతా రంగం కింద వర్గీకరణ చేయడానికి అర్హత పొందుతాయి. చిన్న ఋణ బ్యాంకుల (యస్.యఫ్.బీలు) కోసం సంక్షిప్తసంకలనం (కంపెన్డియం) ప్రకారం వ్యక్తులకిచ్చే ఋణాలు, కుటుంబంఒక్కోదానికి నివాస గృహం కొనటానికి/నిర్మాణంనకు, మొత్తం ఖర్చు మెట్రోపాలిటన్ (పది లక్షలు మరియు అంతకు పైబడి జనాభా ఉన్న) కేంద్రాలలో అయితే 35 లక్షలకు దాటకుండా మరియు ఇతర కేంద్రాలలో అయితే 25 లక్షలకు దాటకుండా ఉన్నట్లయితే, వ్యక్తులకు మెట్రోపాలిటన్ కేంద్రాలలో రుణాలు 28 లక్షల వరకు మరియు ఇతర కేంద్రాలలో రుణాలు 20 లక్షల వరకు, ప్రాధాన్యతా రంగం కింద వర్గీకరణ చేయడానికి అర్హత పొందుతాయి.

3. ఆర్.ఆర్.బీలు మరియు యస్.యఫ్.బీలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల తో సమాన స్థాయికి తెచ్చే క్రమంలో, ప్రాధాన్యతా రంగం కింద అర్హత పొందడానికై వారిచ్చే గృహ రుణాల పరిమితిని పెంచాలని నిర్ణయించడమైనది. తదనుగుణంగా ఆర్.ఆర్.బీలు మరియు యస్.యఫ్.బీలకు సంబంధించి, వారు వ్యక్తులకిచ్చే ఋణాలు, కుటుంబంఒక్కోదానికి నివాస గృహం కొనటానికి/నిర్మాణంనకు, మొత్తం ఖర్చు మెట్రోపాలిటన్ (పది లక్షలు మరియు అంతకు పైబడి జనాభా ఉన్న) కేంద్రాలలో అయితే 45 లక్షలకు దాటకుండా మరియు ఇతర కేంద్రాలలో అయితే 30 లక్షలకు దాటకుండా ఉన్నట్లయితే, మెట్రోపాలిటన్ కేంద్రాలలో ఇచ్చే రుణాలు 35 లక్షల వరకు మరియు ఇతర కేంద్రాలలో అయితే రుణాలు 25 లక్షల వరకు, ప్రాధాన్యతా రంగం కింద వర్గీకరణ చేయడానికి అర్హత పొందుతాయి.

4. ఇంతేకాకుండ, పైన చెప్పిన ఆర్.ఆర్.బీల ప్రధాన నిర్దేశం (మాస్టర్ డైరెక్షన్) పేరా 9.4/ చిన్న ఋణ బ్యాంకుల కోసం సంక్షిప్తసంకలనం (కంపెన్డియం) పేరా 5.4 ప్రకారం, ప్రత్యేకంగా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు మరియు అల్పాదాయ వర్గాలకు ఇళ్ళ నిర్మాణం చేబట్టే హౌసింగ్ ప్రాజెక్టులకోసం, ఇపుడున్న కుటుంబ సంవత్సర ఆదాయ పరిమితి 2 లక్షలను, ఆర్ధికంగా వెనుకబడిన వర్గమైతే సంవత్సరానికి 3 లక్షలు, అల్పాదాయ వర్గమైతే సంవత్సరానికి 6 లక్షలుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్దేశించిన ఆదాయ ప్రామాణిక తో సరిసమానంగా సవరించబడింది.

5. దీని ప్రకారం, ఈ సర్క్యులర్ తేదీ నుండి ప్రాధాన్యతా రంగ రుణాల కింద వర్గీకరణ కోసం సవరించిన ప్రమాణాలకు అనుగుణంగా గృహ రుణ బకాయిల సముచ్చయాన్ని అంచనాకట్టదానికి ఆర్.ఆర్.బీలు/యస్.యఫ్.బీలు అనుమతించబడతాయి.

6. ప్రధాన నిర్దేశం (మాస్టర్ డైరెక్షన్) / సంక్షిప్తసంకలనం (కంపెన్డియం) కింద పేర్కొన్న అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటి మార్పులు లేవు.

మీ విధేయులు

(గౌతం ప్రసాద్ బోరా)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?