<font face="mangal" size="3">వర్చువల్ కరెన్సీ (VCs) లావాదేవీలపై నిషేధం</font> - ఆర్బిఐ - Reserve Bank of India
వర్చువల్ కరెన్సీ (VCs) లావాదేవీలపై నిషేధం
ఆర్బిఐ/2017-18/154 ఏప్రిల్ 6, 2018 అన్ని వాణిజ్య మరియు సహకార బ్యాంకులు / ప్రియమైన సర్ / మేడమ్, వర్చువల్ కరెన్సీ (VCs) లావాదేవీలపై నిషేధం భారతీయ రిజర్వు బ్యాంకు డిసెంబర్ 24, 2013, ఫిబ్రవరి 01, 2017 మరియు డిసెంబర్ 05, 2017 నాటి పత్రికా ప్రకటనల ద్వారా వర్చువల్ కరెన్సీల వర్తకులను, యజమానులను, వ్యాపారులను, వర్చువల్ కరెన్సీలతో (బిట్ కాయిన్స్ సహా), కార్యకలాపాలు జరిపేటప్పుడు మిళితమై వుండే వివిధనష్టాల గురించి పదే పదే హెచ్చరించింది. 2. మిళితమై వుండే నష్టాల దృష్ట్యా, భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా నియంత్రించబడే సంస్థలు, వీసీలతో వ్యవహరించకూడదు లేదా వీసీలతో వ్యవహరించే లేదా పరిష్కరించడానికి ఏదైనా వ్యక్తిని లేదా సంస్థను ఏర్పరచటానికి సేవలను అంటే అటువంటి సేవల ఖాతాలను నిర్వహించడం, వర్తకం చేయడం, సెటిల్మెంట్, క్లియరింగ్, వర్చువల్ టోకెన్లకు రుణాలు ఇవ్వడం, వాటిని అనుషంగికంగా అంగీకరించడం, వీసీ కార్యకలాపాలు నిర్వహించే ఎక్స్ఛేంజిల ఖాతాలను ప్రారంభించడం మరియు వీసీల కొనుగోలు / విక్రయాలకు సంబంధించి ఖాతాలలో బదిలీ / డబ్బు అందుకోవడం, అందించకూడదు అని నిర్ణయించబడింది. 3. అటువంటి సేవలను ఇప్పటికే అందించే నియంత్రించబడే సంస్థలు, ఈ సర్కులర్ తేదీ నుండి మూడు నెలల్లో, అట్టి కార్యకలాపాలనుండి నిష్క్రమించాలి. 4. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 36 (1) (a) తో కలిపి సెక్షన్ 35A, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 56, సెక్షన్ 36 (1) (a) తో కలిపి సెక్షన్ 35A, మరియు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా యాక్ట్, 1934, సెక్షన్ 45JA మరియు 45L, మరియు చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007, సెక్షన్ 18 తో కలిపి, సెక్షన్ 10 (2) క్రింద ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించుకొని, ఈ మార్గదర్శకాలు జారీచేయబడ్డాయి మీ విధేయులు, (సౌరవ్ సిన్హా) |