<font face="mangal" size="3">ఏజెన్సీ బ్యాంకులచే ప్రభుత్వ ఆదేశాల సత్వర అķ - ఆర్బిఐ - Reserve Bank of India
ఏజెన్సీ బ్యాంకులచే ప్రభుత్వ ఆదేశాల సత్వర అమలు
ఆర్.బి.ఐ/2017-18/111 డిసెంబర్ 21, 2017 అన్ని ఏజెన్సీ బ్యాంకులు డియర్ సర్/మేడమ్, ఏజెన్సీ బ్యాంకులచే ప్రభుత్వ ఆదేశాల సత్వర అమలు భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి మరింత సమాచారం వారికి అందలేదని ఉటంగిస్తూ, కొన్ని ఏజెన్సీ బ్యాంకులు ప్రభుత్వ (కేంద్ర మరియు రాష్ట్రాల) ఉత్తర్వులను / సూచనలను సత్వరం అమలు చేయడం లేదని మా దృష్టికి తీసుకురాబడింది. 2. ఈ సందర్భంగా అన్ని ఏజెన్సీ బ్యాంకులు, ప్రభుత్వ (కేంద్ర మరియు రాష్ట్రాల) అనేక నోటిఫికేషన్ల లోని ఉత్తర్వులను / సూచనలను అన్నింటినీ కచ్చితంగా ఆచరించవలసినదిగా ఆదేశించడమైనది. మరియు భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి మరిన్ని ఆదేశాల కోసం వేచిచూడకుండా, తక్షణo తగిన చర్యలు తీసుకోవాలి. 3. అంతేగాకుండా, ఇటువంటి ఉత్తర్వులు/సూచనలకు సంబంధించిన సందేహాలను ఏజెన్సీ బ్యాంకులు నేరుగా సంబంధిత ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లవలసింది మరియు ఈ సందేహాలు ఒకవేళ రిజర్వ్ బ్యాంకుకు రిపోర్టింగ్ కు సంబందించినవైతే, అపుడు వాటిని DGBA / CAS, నాగపూర్ కు సంబోధించవలసింది. మీ విధేయులు (పార్థా చౌధురి) |