<font face="mangal" size="3">ప్రజలు <span style="font-family:Arial;">₹</span> 10 నాణేల చట్టబద్ధ చెలామణి (లీగల - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రజలు ₹ 10 నాణేల చట్టబద్ధ చెలామణి (లీగల్ టెండర్) అంగీకారం ను కొనసాగించాలి - ఆర్బీఐ
నవంబర్ 20, 2016 ప్రజలు ₹ 10 నాణేల చట్టబద్ధ చెలామణి (లీగల్ టెండర్) అంగీకారం ను కొనసాగించాలి - ఆర్బీఐ భారత ప్రభుత్వం చే ముద్రించబడిన (మింట్ చేయబడిన) నాణేలను (కాయిన్లు) రిజర్వు బ్యాంక్ చెలామణిలోకి తెచ్చింది.ఈ నాణేలు విలక్షమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్రజల లావాదేవీల అవసరాలను తీర్చడానికి కొత్త డినామినేషన్ ల లోను మరియు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఇతివృత్తాలతో కొత్త డిజైన్ల లోను, నాణేలను ఎప్పటికప్పుడు చలామణిలోకి తీసుకురావడం జరిగింది. చెలామణిలో ఉన్న నాణేలు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండటం మూలాన, ఒకే సమయంలో వివిధ డిజైన్లలో మరియు ఆకృతిలలో ఈ నాణేలు మార్కెట్లో చట్టబద్ధంగా చలామణీలో ఉండటం పూర్తిగా సాధ్యమే. అటువంటి మార్పుల్లో జూలై 2011 సంవత్సరంలో నాణేలలో రూపాయి చిహ్నం (రుపీ సింబల్) ప్రవేశపెట్టడం ఒకానొక మార్పు. రూపాయి చిహ్నం (రుపీ సింబల్) కలిగిన ₹ 10 నాణేలు, అటువంటి చిహ్నం (రుపీ సింబల్) లేని అదే డినామినేషన్ గల నాణేలు ఒకే సమయంలో చలామణీలో ఉండటం ఇందుకు ఒక్క ఉదాహరణ. ఇవి కొంచెం భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ, ఈ రెండూ కూడా లావాదేవీల కోసం సమానంగా మరియు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. తక్కువ సమాచారంతోనూ లేదా అసలు తెలియకుండాను కొంతమంది వ్యక్తులు, ఈ నాణేలు చెల్లుబాటు కావనే తప్పుడు అపోహతో సామాన్య ప్రజల, వ్యాపారస్థుల, చిల్లర వర్తకుల, మొదలైన వారల మనస్సులలో సందేహాలు సృష్టిస్తున్నారని, దీనివల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నాణేల చెల్లుబాటుకు అవరోధం ఏర్పడి, అనవసర గందరగోళానికి దారితీసిందని మాకు తెలియచేయబడింది. అటువంటి తప్పుడు ఉద్దేశ్యాలకు తావివ్వద్దని వాటిని దరిచేయనీయవద్దని మరియు లావాదేవీల కోసం ప్రజలు ఎటువంటి అనుమానం లేకుండా ఈ నాణేల చెల్లుబాటుకు అంగీకారం కొనసాగించాలని రిజర్వ్ బ్యాంకు ప్రజలకు తెలియచెప్పింది. ఈ నాణేల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి ఈ క్రింది లింక్ ను సందర్శించండి: /en/web/rbi/press-releases
జోస్ జె.కట్టూర్ ప్రెస్ రిలీజ్: 2016-2017/1257 |