<font face="mangal" size="3">అన్ని నాణేలను చట్టబద్ధమైన నాణేలు గా ప్రజలు ij - ఆర్బిఐ - Reserve Bank of India
అన్ని నాణేలను చట్టబద్ధమైన నాణేలు గా ప్రజలు అంగీకరించవచ్చు:
భారతీయ రిజర్వు బ్యాంకు
తేది: 26/06/2019 అన్ని నాణేలను చట్టబద్ధమైన నాణేలు గా ప్రజలు అంగీకరించవచ్చు: భారత ప్రభుత్వం ముద్రించిన నాణేలను భారతీయ రిజర్వు బ్యాంకు చెలామణిలో పెడుతుంది. ఈ నాణేలు విలక్షణమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక - వివిధ ఇతివృత్తాలను ప్రతిబింబించేలా క్రొత్త లావాదేవీల అవసరాలకు మరియు క్రొత్త డిజైన్లలో, నాణేలు ఎప్పటికప్పుడు ప్రవేశపెడతారు. నాణేలు ఎక్కువ కాలం చెలామణిలో ఉన్నందున, వేర్వేరు నమూనాలు మరియు పరిమాణాల నాణేలు ఒకే సమయంలో చెలామణిలో ఉంటాయి. ప్రస్తుతం, 50 పైసల నాణేలు, ₹ 1/-, 2/-, 5/- మరియు 10/- నాణేలు వివిధ పరిమాణాలు, నేపధ్యాలు (థీమ్) మరియు డిజైన్లతో చెలామణిలో ఉన్నాయి. అటువంటి నాణేల యొక్క యథార్థతకు సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయని మరియు దీని ఫలితంగా కొంతమంది వ్యాపారులు, దుకాణదారులు మరియు ప్రజలు నాణేలను అంగీకరించడంలో సందేహిస్తున్నారని నివేదించబడింది. ఇది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నాణేల సులభ వినియోగానికి మరియు చలామణికి ఆటంకం కలిగిస్తున్నది. ఇలాంటి పుకార్లకు విశ్వసనీయత ఇవ్వవద్దని, తమ లావాదేవీలన్నింటికీ ఎటువంటి సంకోచం లేకుండా అన్ని నాణేలను చట్టబద్ధమైన నాణేలుగా ప్రజలు అంగీకరించి చెలామణిలో కొనసాగించాలని భారతీయ రిజర్వు బ్యాంకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. లావాదేవీల కోసం అన్ని నాణేలను అంగీకరించాలని మరియు వారి అన్ని శాఖల వద్ద మార్పిడి చేయమని భారతీయ రిజర్వు బ్యాంకు విడిగా బ్యాంకులకు తన సూచనలను, జనవరి 14, 2019 వరకు నవీకరించబడిన డిసిఎం(NE)సంఖ్య.G-2/08.07.18/2018-19, జూలై 2, 2018 నాటి సర్కులర్ ద్వారా పునరుద్ఘాటించింది యోగేశ్ దయాల్ పత్రికా ప్రకటన: 2018-2019/3056 |