<font face="mangal" size="3">రంగారెడ్డి కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., హ - ఆర్బిఐ - Reserve Bank of India
రంగారెడ్డి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణ, - జరిమానా విధింపు
తేదీ: సెప్టెంబర్ 22, 2017 రంగారెడ్డి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణ, భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 47 (A)(1)(b) (సెక్షన్ 46(4) తో కలిపి), క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, రంగారెడ్డి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణపై ₹ 1.00 లక్ష (కేవలం లక్ష రూపాయిలు) నగదు జరిమానా విధించినది. ఎక్స్పోజర్ నియమాలు (exposure norms), UCBలకు వర్తించే చట్టబద్ధ / ఇతర హద్దులకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు మరియు మార్గదర్శకాలు ఉల్లంఘించినందున, ఈ జరిమానా విధించబడింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చి, దానిపై మౌఖిక వినతులుకూడా చేసినది. ఈ విషయంలో నిజానిజాలు మరియు బ్యాంక్ సమర్పించిన జవాబు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/815 |