త్రిపక్ష రెపో (Tri-Party REPO) ఆరంభించడం పై ముసాయిదా విధివిధానాలు ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్
ఏప్రిల్ 11, 2017 త్రిపక్ష రెపో (Tri-Party REPO) ఆరంభించడం పై రిజర్వ్ బ్యాంక్ ఈరోజు త్రిపక్ష రెపో ప్రవేశపెట్టడం గురించి ముసాయిదా విధివిధానాలు విడుదలచేసింది. త్రిపక్ష రెపో, మార్కెట్లో పాల్గొనేవారు అదనంగా సమర్పించిన హామీని (underlying collateral) సమర్థవంతంగా వినియోగించుకొనే వీలుకల్పించి, టర్మ్ రెపో మార్కెట్ వృద్ధిచెందడానికి తోడ్పడుతుంది. ముసాయిదా నిర్దేశాలు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు, రెండింటిలోనూ త్రిపక్ష రెపో ఆరంభించడానికి అనుమతిస్తాయి. మార్కెట్‌లో పాల్గొనేవారినుండి, మే 5, 2017 లోగా అభిప్రాయాలని ఆహ్వానిస్తున్నాము. వారి అభిప్రాయాలని ఇ-మైల్ ద్వారాగానీ లేక చీఫ్ జనరల్ మానేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ ఆఫీస్, మైన్ బిల్డింగ్, ముంబై-400001 వారికి, తపాలా ద్వారాగానీ, పంపవచ్చు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/2739 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: