<font face="mangal" size="3">రెసిడెంట్లకూ, నాన్‌-రెసిడెంట్లకూ సులభంచేసి& - ఆర్బిఐ - Reserve Bank of India
రెసిడెంట్లకూ, నాన్-రెసిడెంట్లకూ సులభంచేసిన హెడ్జింగ్ సదుపాయం- ముసాయిదా విధివిధానాలు ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్
ఏప్రిల్ 12, 2017 రెసిడెంట్లకూ, నాన్-రెసిడెంట్లకూ సులభంచేసిన హెడ్జింగ్ సదుపాయం- రిజర్వ్ బ్యాంక్ ఈరోజు రెసిడెంట్లకూ, నాన్-రెసిడెంట్లకూ సరళీకరించిన హెడ్జింగ్ సదుపాయం గురించి ముసాయిదా విధివిధానాలు విడుదలచేసింది. వీటివల్ల, క్రియాశీలంగా, చురుకుగా కరెన్సీ రిస్క్ హెడ్జింగ్ చేయడానికి, హెడ్జ్ కాంట్రాక్టులు కుదుర్చుకోనే విధానం సులభతరంకావడానికి వీలవుతుంది. మార్కెట్లో పాల్గొనేవారినుండి, ఆసక్తిగల ఇతరులనుండి, మే 5, 2017 లోగా అభిప్రాయాలని ఆహ్వానిస్తున్నాము. వారి అభిప్రాయాలని ఇ-మైల్ ద్వారాగానీ లేక చీఫ్ జనరల్ మానేజర్, ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1st ఫ్లోర్, మైన్ బిల్డింగ్, షహీద్ భగత్ సింఘ్ రోడ్, ఫోర్ట్, ముంబై-400001 వారికి, తపాలా ద్వారాగానీ, పంపవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటన అభివృద్ధి, నియంత్రణ విధానాల నివేదిక (Statement on Developmental and Regulatory Policies) ఏప్రిల్ 06, 2017 తేదీన చేయబడింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/2759 |