<font face="mangal" size="3px">శ్రీమ‌తి మాళ‌వికా సిన్హాను నూత‌న ఎగ్జిక్యూ& - ఆర్బిఐ - Reserve Bank of India
శ్రీమతి మాళవికా సిన్హాను నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించిన RBI
ఏప్రిల్ 05, 2017 శ్రీమతి మాళవికా సిన్హాను నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించిన RBI భారత రిజర్వ్ బ్యాంక్ శ్రీ BP కనుంగోను ఏప్రిల్ 03, 2017న డిప్యూటీ గవర్నర్ గా నియమించిన అనంతరం శ్రీమతి మాళవికా సిన్హాను నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ED) గా నియమించింది. శ్రీమతి మాళవికా సిన్హా ఏప్రిల్ 03, 2017న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా శ్రీమతి మాళవికా సిన్హా విదేశీ మారకద్రవ్య విభాగం, ప్రభుత్వ మరియు బ్యాంక్ అకౌంట్ల విభాగం, అంతర్గత రుణ నిర్వహణా విభాగాల బాధ్యతలను నిర్వర్తిస్తారు. శ్రీమతి మాళవికా సిన్హా యూనివర్సిటీ ఆఫ్ బాంబే నుండి మాస్టర్ డిగ్రీ పట్టా పొందారు. ఆమె తన మాస్టర్స్ ను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పూర్తి చేశారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ లో ఆమె సర్టిఫైడ్ అసోసియేట్ గా ఉన్నారు. 1982లో రిజర్వ్ బ్యాంక్ లో కెరీర్ సెంట్రల్ బ్యాంకర్ గా చేరిన శ్రీమతి సిన్హా, నియంత్రణ మరియు పర్యవేక్షణ, విదేశీ మారకద్రవ్యం, ప్రభుత్వ మరియు బ్యాంకు అకౌంట్ల విభాగాలలో పని చేశారు. ఈడీగా పదదోన్నతి పొందడానికి ముందు శ్రీమతి సిన్హా రిజర్వ్ బ్యాంక్ లోని సహకార బ్యాంకింగ్ పర్యవేక్షణ విభాగంలో ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2016-17/2682 |