RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503275

బ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్యొక్క లైసెన్స్ రిజర్వ్ బ్యాంకు రద్దుచేసినది

తేది: జులై 04, 2018

బ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి.,
కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్యొక్క లైసెన్స్ రిజర్వ్ బ్యాంకు రద్దుచేసినది

భారతీయ రిజర్వ్ బ్యాంక్, వారి ఆదేశం జూన్ 26, 2018 ద్వారా, బ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి, కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్కు, బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుటకు జారీ చేసిన అనుమతిని, జులై 03, 2018 పనివేళల ముగింపు సమయంనుండి, రద్దుచేసినది. బ్యాంక్ మూసివేయుటకు ఉత్తరువులు జారీచేసి, లిక్విడేటర్ను నియమించవలసిందిగా రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్, ఉత్తర్ ప్రదేశ్ను కోరడం జరిగింది.

రిజర్వ్ బ్యాంక్, ఈ క్రింది కారణాలవల్ల బ్యాంక్ లైసెన్స్ రద్దుచేసినది:

i. బ్యాంకుకు చాలినంత మూలధనం, లాభార్జన అవకాశాలు లేవు. అందువల్ల, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 11(1) మరియు 22 (3) (d) (సెక్షన్ 56 తో కలిపి) నిబంధనలు పాటించుటలో బ్యాంక్ విఫలమైనది.

ii. బ్యాంకు, వారి ప్రస్తుత/భవిష్య డిపాజిటర్లు కోరినప్పుడు వారి సొమ్ము పూర్తిగా చెల్లించేస్థితిలో లేదు. ఈకారణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 22 (3)(a) (సెక్షన్ 56 తో కలిపి) నిబంధనలు నెరవేర్చుటలో విఫలమైనది.

iii. బ్యాంకు కార్యకలాపాలు, ప్రస్తుత / భవిష్య డిపాజిటర్ల ప్రయోజనాలకు హానికరంగా నిర్వర్తించబడుతున్నాయి. అందువల్ల, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 22 (3)(b) (సెక్షన్ 56తో కలిపి) నిబంధనల అమలులో విఫలమైనది.

iv. తగినంత సమయమూ, అవకాశమూ ఇచ్చినప్పటికీ, మూలధన పెంపునకు, పునర్వ్యవస్థీకరణకు బ్యాంక్ ఎటువంటి సకారాత్మక చర్యలు చేపట్టలేదు. ఇంతేగాక, మార్చ్ 31, 2014, మార్చ్ 31, 2015, మార్చ్ 31, 2016 మరియు మార్చ్ 31, 2017 తేదీలనాటి ఆర్థిక స్థితికి సంబంధించిన తనిఖీలో, బ్యాంకుయొక్క ఆర్థిక స్థితి మరింత దిగజారినట్లు, వెల్లడయినది. బ్యాంకుయొక్క ఆర్థిక స్థితి పుంజుకొనే అవకాశం ప్రస్తుతం కనిపించుటలేదు. ఈ కారణంగా బ్యాంకు, చట్టం లోని సెక్షన్ 22(3) (c) నిబంధనలు నెరవేర్చుటలో విఫలమైనది.

v. చట్టం లోని సెక్షన్ 22(3) (e) లో సూచించిన ప్రకారం, బ్యాంకును కొనసాగించుటలో ఎట్టి ప్రయోజనము ఉండదు. కాకపోగా, బ్యాంకింగ్ వ్యాపారంచేయుటకు మరికొంత సమయం అనుమతిస్తే, ప్రజా ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుంది.

బ్యాంకింగ్ లైసెన్స్ రద్దుచేసిన కారణంగా, బ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 5 (b) క్రింద (సెక్షన్ 56 తో కలిపి) నిర్వచించిన 'బ్యాంకింగ్' కార్యకలాపాలు నిర్వహించుట (డిపాజిట్లు అంగీకరించుట / తిరిగిచెల్లించుటతోసహా), తక్షణం నిషేధించబడినది.

లైసెన్స్ రద్దుచేయడం, లిక్విడేషన్ చర్యలు మొదలుకావడంతో, బ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్, ఖాతాదార్లకు, DICGC చట్టం, 1961 ప్రకారం, చెల్లింపులు చేసే ప్రక్రియ ప్రారంభమౌతుంది. లిక్విడేషన్ చర్యలు పూర్తికాగానే, ప్రతి ఖాతాదారు, వారి డిపాజిట్లు, రూ. 1,00,000/- (కేవలం లక్ష రూపాయిలు) పరిమితి వరకు, డిపాజిట్ ఇన్స్యూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) నియమ నిబంధనలకు అనుగుణంగా, తిరిగి పొందుటకు అర్హులౌతారు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/25

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?