<font face="Mangal" size="3">మోసపూరిత ఇ-మైళ్ళ (fictitious e-mails) గురించి, రిజర్వ్ బ్యాంకĺ - ఆర్బిఐ - Reserve Bank of India
మోసపూరిత ఇ-మైళ్ళ (fictitious e-mails) గురించి, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక
తేది: జులై 04, 2018 మోసపూరిత ఇ-మైళ్ళ (fictitious e-mails) గురించి, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక రిజర్వ్ బ్యాంక్ పేరుతో మోసగాళ్ళు, ప్రజలను వంచిస్తున్నారని రిజర్వ్ బ్యాంక్, ఇంతకు ముందునుండి ఎన్నోమార్లు చెబుతూవచ్చింది. ఈ దగాకోరులు, రిజర్వ్ బ్యాంక్ నకిలీ లెటర్ హెడ్లు వినియోగించి, రిజర్వ్ బ్యాంక్ అధికారులవలె నటిస్తూ అబద్ధపు ఉద్యోగావకాశాలు, లాటరీలో గెలుపొందారని, విదేశీ ముద్రా రుణాలు చవకగా ఇప్పిస్తామని మోసపూరిత ఇ-మైళ్ళు పంపుతూ ఉంటారు. అవి నమ్మి మోసపోయిన వారినుండి, ప్రాసెసింగ్ రుసుము / విదేశీ ముద్రా మారక రుసుము / ముందు చెల్లింపు, పేరిట సొమ్ము వసూలుచేస్తారు. 'ప్రజల అవగాహన కొరకు ప్రచారం' (Public Awareness Campaign) లో భాగంగా, రిజర్వ్ బ్యాంక్ ఎస్ ఎమ్ ఎస్‌లు, బయట ప్రకటనలు, లఘుచిత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. రిజర్వ్ బ్యాంక్, ఈ క్రింది విషయాలు మరొకమారు నొక్కి చెపుతున్నది:
రిజర్వ్ బ్యాంక్ పేరుతో అటువంటి సందేశాలు పంపే మోసగాళ్ళకు / మోసపూరిత సంస్థలకు జవాబు ఈయవద్దని, వారి వలలో పడవద్దని ప్రజలకు సూచన. జోస్ జె కత్తూర్ పత్రికా ప్రకటన 2018-2019/34
|