<font face="mangal" size="3">అనధికార విదేశీ ముద్రా వర్తకం ప్లాట్‌ఫారమ్‌&# - ఆర్బిఐ - Reserve Bank of India
అనధికార విదేశీ ముద్రా వర్తకం ప్లాట్ఫారమ్లకు వ్యతిరేకంగా ఆర్బీఐ హెచ్చరిక
ఫిబ్రవరి 03, 2022 అనధికార విదేశీ ముద్రా వర్తకం ప్లాట్ఫారమ్లకు వ్యతిరేకంగా ఆర్బీఐ సామాజిక మాధ్యమం ప్లాట్ఫారమ్లు, సెర్చ్ ఇంజన్లు, ఓవర్ ది టాప్తో సహా, (OTT) ప్లాట్ఫారమ్లు, గేమింగ్ యాప్లు మరియు అటువంటి ఇతర మాధ్యమాల ద్వారా విదేశీ ముద్రా వర్తకం సౌకర్యాలను అందించే అనధికార ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫారమ్ (ETPs) లను గురించి భారతీయ నివాసితులను తప్పుదారి పట్టించే ప్రకటనలను భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) గమనించింది. విదేశీ ముద్రా వర్తకం చేపట్టడానికి వ్యక్తిగతంగా సంప్రదించే ఏజెంట్లను, ETPలు నియమించి, వర్తకం/పెట్టుబడి పథకాలు మరియు అసమానమైన, విపరీతమైన రాబడి వాగ్దానాలతో అమాయక వ్యక్తులను ప్రలోభపెట్టడం వంటి మోసాలకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. చాలా మంది నివాసితులు అటువంటి అనధికారిక ETPలు / పోర్టల్లు మరియు వర్తకం/పెట్టుబడి పథకాలు ద్వారా డబ్బును కోల్పోతున్నారు. అధీకృత వ్యక్తులు మరియు అనుమతించబడిన ప్రయోజనాల కోసం, నివాసి వ్యక్తులు మాత్రమే విదేశీ ముద్రా లావాదేవీలను, విదేశీ ముద్రా నిర్వహణ చట్టం, 1999 (FEMA) అనుమతించబడినప్పుడు మాత్రమే విదేశీ ముద్రా లావాదేవీలను చేపట్టవచ్చని స్పష్టం చేయబడింది. ఆర్బీఐ ద్వారా ప్రయోజనం కోసం అధికారం కలిగిన ETPలపై, లేదా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలలో (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్., BSE లిమిటెడ్ మరియు మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.) నిబంధనల ప్రకారం మరియు ఆర్బీఐ కాలానుగుణంగా నిర్దేశించిన షరతులతో మాత్రమే ఎలక్ట్రానిక్గా వాటిని చేపట్టాలి అని కూడా స్పష్టం చేయబడుతుంది. ఫెమా (FEMA) క్రింద రూపొందించబడిన సరళీకృత చెల్లింపు పథకం (LRS) ప్రకారం, మార్జిన్ల కోసం ఓవర్సీస్ ఎక్స్ఛేంజీలకు / ఓవర్సీస్ కౌంటర్పార్టీలు అనుమతించబడవు. అధీకృత వ్యక్తులు మరియు అధీకృత ETPల జాబితా ఆర్బీఐ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. విదేశీ ముద్రా లావాదేవీలపై తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు) కూడా, ప్రజల సాధారణ మార్గదర్శకత్వం కోసం వెబ్సైట్లో ఉంచబడింది. ముద్రా లావాదేవీలు కోసం అటువంటి అనధికార ETPలు ఉపయోగించవద్దని, లేదా చెల్లింపు/డిపాజిట్ వంటి అనధికార విదేశీ ముద్రా లావాదేవీలు చేపట్టవద్దని ఆర్బీఐ ప్రజలను హెచ్చరిస్తుంది. FEMA లేదా ఆర్బీఐ చేత అధీకృతం కాని ETPలపై అనుమతించబడిన వాటి కంటే ఇతర ప్రయోజనాల కోసం విదేశీ ముద్రా లావాదేవీలను చేపట్టిన అట్టి వారు FEMA క్రింద చట్టపరమైన చర్యలకు తామే బాధ్యులు. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2021-2022/1660 |