కాల్పనిక కరెన్సీల (virtual currencies) వినియోగం గురించి, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక
తేదీ ఫిబ్రవరి 01, 2017 కాల్పనిక కరెన్సీల (virtual currencies) వినియోగం గురించి, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక భారతీయ రిజర్వ్ బ్యాంక్, బిట్ కాయిన్ల వంటి కాల్పనిక కరెన్సీల వినియోగదారులకు, కలిగిఉన్నవారికి, వ్యాపారులకు వీటివల్ల ఆర్థికంగా, వ్యవహారపరంగా, చట్టపరంగా, వినియోగదారుల భద్రతాపరంగా కలగబోయే ప్రమాదాల గురించి రిజర్వ్ బ్యాంక్, డిసెంబర్ 24, 2013 తేదీన జారీచేసిన పత్రికా ప్రకటనద్వారా, హెచ్చరించినది. రిజర్వ్ బ్యాంక్ ఏ సంస్థకూ / కంపెనీకి, ఇటువంటి పథకాలు నిర్వహించుటకు లేక బిట్ కాయిన్లు, లేదా ఏ ఇతర VCలలో వ్యాపారముచేయుటకు లైసెన్స్ / అనుమతి జారీచేయలేదని తెలిపినది. అందువల్ల, కాల్పనిక కరెన్సీలు ఉపయోగించేవారు, కలిగిఉన్నవారు, మదుపరులు, మొదలైనవారు దానివల్ల కలిగే నష్టాలకు వారే బాధ్యులు. జోస్ జె కత్తూర్ పత్రికా ప్రకటన: 2017-2018/2054 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: