RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510827

కాల్పనిక కరెన్సీల (వి సిలు, virtual currencies, VCs) వినియోగదారులకు, రిజర్వ్ బ్యాంక్, ప్రమాద హెచ్చరిక

తేదీ: డిసెంబర్ 24, 2013

కాల్పనిక కరెన్సీల (వి సిలు, virtual currencies, VCs) వినియోగదారులకు, రిజర్వ్ బ్యాంక్, ప్రమాద హెచ్చరిక

కాల్పనిక కరెన్సీలు (బిట్ కాయిన్లతోసహా) ఉపయోగించేవారిని, కలిగి ఉన్నవారిని, వ్యాపారులనూ, వీటిని ఉపయోగించడం వల్ల ఆర్థికంగా, వ్యవహారపరంగా, వినియోగదారుల రక్షణ, భద్రతకు సంబంధించి, సంభవించగల ప్రమాదాలగురించి రిజర్వ్ బ్యాంక్ ఈరోజు హెచ్చరించినది.

Bit కాయిన్లు, liteకాయిన్లు, bbq కాయిన్లు, doge కాయిన్లకు సంబంధించిన 'డీసెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీ' (Decentralised Digital Currency) లేక 'వర్చువల్ కరెన్సీ'లకు (Virtual Currencies, VCs) సంబంధించిన రికార్డులు మొదలైనవి, మరియు దేశంలో వాటి వినియోగం, వ్యాపారం, వివిధ మాధ్యమాలలో వీటిపై ప్రచురింపబడుతున్న వార్తలూ, పరిశీలిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

వీటి సృష్టి, వీటితో వ్యాపారంచేయుట లేక వీటని ఉపయోగించుట లేక చెల్లింపు మాధ్యమంగా వీ సిలు ఉపయోగించుట, ఏ కేంద్రీయ బ్యాంక్ లేదా ఆర్థిక అధికార సంస్థచే, అనుమతించబడలేదు. ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, ఏ నియంత్రణా వ్యవస్థలనుండీ, అనుమతులు, నమోదులు, సమ్మతి పొందలేదు. అందువల్ల ఇవి ఉపయోగించేవారు, ఈక్రింద తెలిపినవాటితో సహా, పలు ప్రమాదాలు ఎదుర్కొనవచ్చును:

  1. వి సిలు కాల్పనిక కరెన్సీలుగనుక, డిజిటల్ / ఎలక్ట్రానిక్ మాధ్యమంలో నిల్వచేయబడతాయి. వీటిని ఎలక్ట్రానిక్ వాలెట్లు అని పిలుస్తారు. అందువల్ల, హ్యాకింగ్, పాస్‌వర్డ్ పోవుట, భద్రతలో రాజీపడుట, మాల్‌వేర్ దాడిచేయుట మొదలైనవి సంభవించినప్పుడు, నష్టాలు కలుగవచ్చు. ఇవి, అధికృత కేంద్ర రిజిస్ట్రీలు, ఏజన్సీలద్వారా సృష్టించబడని / ట్రేడ్ చేయబడని కారణంగా, ఇ-వాలెట్‌లోని సొమ్ము పోయినట్లయితే, శాశ్వత నష్టం కలుగుతుంది.

  2. బిట్‌కాయిన్ల ద్వారా చెల్లింపులు ఒకరిమధ్య ఒకరికి జరుగుతాయిగనుక, ఇవి నియంత్రించడానికి, వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులు, చార్జ్ బ్యాక్‌లు, పరిష్కరించడానికి, వ్యవస్థీకృతమైన ఎట్టి కేంద్రీయ సంస్థలూ / ఏజన్సీలు లేవు.

  3. వి సిలకు వెనుక భద్రతగా, ఎట్టి అసెట్లు లేవు. అందువల్ల, వీటి విలువ ఊహాజనితమే. ఇటీవలి కాలంలో, వీటి విలువలో విపరీతమైన మార్పులు కలిగాయి. ఇటువంటి మార్పులవల్ల, తీవ్ర నష్టం సంభవించగలదు.

  4. బిట్ కాయిన్లవంటి వీ సిలు, వివిధ ప్రాంతాలలోని, ఎక్స్చేంజ్ వేదికలపై ట్రేడ్ చేయబడుతున్నాయి. అయితే వీటి చట్టబద్ధహోదా స్పష్టంగా లేదు. ఈ కారణంగా, వీటిని ఉపయోగించేవారు న్యాయపరంగా, ఆర్థికపరంగా ప్రమాదాలు ఎదుర్కొనవచ్చు.

  5. బిట్ కాయిన్లవంటి వీ సిలు వివిధ ప్రాంతాలలలో, అవినీతికరమైన, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వినియోగించడం జరుగుతున్నదని అనేక వార్తలు మాధ్యమాలలో ప్రసారమౌతున్నాయి. అవతలివారి పేరుతెలియకుండా, మారుపేర్లతో కార్యకలాపాలు జరపడం వల్ల తెలియకుండానే, ఏంటి మనీ లాండరింగ్, ఆటంకవాదులకు ఆర్థిక సహాయంపై పోరాటం [Anti-money laundering (AML) / Combating the Financing of terrorism (CFT)] చట్టాలను ఉల్లంఘించవచ్చు.

  6. వి సిలను ఉపయోగించుట, కలిగి ఉండుట, వీటితో వ్యాపారం చేయుట సంబంధించిన అంశాలు, అమలులో ఉన్న విదేశీ మారక మరియు చెల్లింపు విధానాలతో సహా, ప్రస్తుతం అమలులోగల చట్ట / నియంత్రణ వ్యవస్థల నిబంధనల క్రింద పరిశీలిస్తున్నట్లుకూడా, రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2013-2014/1261

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?