<font face="mangal" size="3">ముంబైలో భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోĸ - ఆర్బిఐ - Reserve Bank of India
ముంబైలో భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోర్డ్ సమావేశం
తేదీ: 19/11/2018 ముంబైలో భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోర్డ్ సమావేశం భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోర్డ్ ఈరోజు, ముంబైలో సమావేశమయ్యింది. బాజెల్ మూలధన నియంత్రణా వ్యవస్థ (Basel regulatory capital framework); ఒత్తిడికి లోనైన ఎమ్ ఎస్ ఎమ్ ఇ ల పునర్వ్యవస్థీకరణ (restructuring of MSMEs); బ్యాంకుల స్వస్థతకు, తక్షణ దిద్దుబాటు చర్యల వ్యవస్థ (పి సి ఎ, Prompt Corrective Action Framework); మరియు రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక మూలధన వ్యవస్థలపై (ఇ సి ఎఫ్, Economic Capital Frame work) చర్చలు జరిగాయి. ఇ సి ఎఫ్; సభ్యత్వం; భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ కలిసి నిర్ణయించవలసిన నిబంధనలు, పరిశీలించడానికి, ఒక నిపుణుల సంఘాన్ని నియమించవలెనని, బోర్డ్ నిర్ణయించింది. మొత్తం 250 మిలియన్ రూపాయిల వరకు రుణపరిమితి కలిగి, ఒత్తిడిలోనున్న ఎం ఎస్ ఎం ఇ రుణగ్రహీతల రుణాలను, పునర్‌వ్యవస్థీకరణ చేయుటకు పథకాన్ని ప్రవేశపెట్టాలని, బోర్డ్, రిజర్వ్ బ్యాంకుకు సూచించింది. అయితే, ఆర్థిక స్థిరత్వానికి అవసరమయిన నిబంధనలు విధించాలని హెచ్చరించింది. సి ఆర్ ఎ ఆర్, మార్పులేకుండా, 9% గానే ఉంచాలని బోర్డ్ నిర్ణయించింది. కేపిటల్ కన్‌జర్వేషన్ బఫర్ (Capital Conservation Buffer) ఆఖరి విడత 0. 625% అమలుకు సమయం, మరొక సంవత్సరం, అనగా మార్చ్ 31, 2020 వరకు, పొడిగించడానికి బోర్డ్ అంగీకరించింది. పి సి ఏ పరిధిలోగల బ్యాంకుల విషయం, రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక పర్యవేక్షణా మండలి (బోర్డ్ ఫర్ ఫైనాన్షియల్ సూపర్విషన్, Board for Financial Supervision, BFS), పరిశీలించాలని నిర్ణయించడం జరిగింది. జోస్ జె కత్తూర్ పత్రికా ప్రకటన: 2018-2019/1165 |