ముంబైలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ బోర్డ్ సమావేశం
తేదీ: 14/12/2018 ముంబైలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ బోర్డ్ సమావేశం శ్రీ శక్తికాంత దాస్, గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్, అధ్యక్షతలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోర్డ్, ముంబైలో ఈరోజు సమావేశమయ్యింది. గవర్నర్‌గా, డిప్యూటీ గవర్నర్‌గా డా. ఉర్జిత్ పటేల్, బ్యాంకుకుచేసిన అమూల్యమైన సేవలను, లిఖితపూర్వకంగా ప్రశంసించింది. రిజర్వ్ బ్యాంక్ పరిపాలనా విధానాన్ని (Governance Framework) కూలంకషంగా చర్చించి, ఈ విషయం మరింత పరిశీలించాల్సిన అవసరం ఉందని, నిర్ణయానికి వచ్చింది. ఇతర అంశాలతోబాటు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి; అంతర్జాతీయ / జాతీయ సవాళ్ళు; ద్రవ్యత; ఆర్థిక వ్యవస్థకు పరపతి బట్వాడా విధానం; కరెన్సీ నిర్వహణ మరియు ఆర్థిక అక్షరాస్యత అంశాలను సమీక్షించింది. ఇండియాలో బ్యాంకింగ్ సరళి మరియు పురోగతి(2017-18) పై (Trend and Progress of Banking in India (2017-18), ముసాయిదా నివేదిక కూడా చర్చించబడింది. జోస్ జె కత్తూర్ పత్రికా ప్రకటన: 2018-2019/1375 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: