<font face="mangal" size="3">ఆర్బీఐ వివరణ - బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ వి - ఆర్బిఐ - Reserve Bank of India
78508783
ప్రచురించబడిన తేదీ అక్టోబర్ 21, 2017
ఆర్బీఐ వివరణ - బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ విధిగా (మేన్దేటరీ) చేయాలి
అక్టోబర్ 21, 2017 ఆర్బీఐ వివరణ - బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ విధిగా (మేన్దేటరీ) చేయాలి సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వొక సమాధానాన్ని కోట్ చేస్తూ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ విధి గా చెయ్యనవసరం లేదని మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. జూన్ 1, 2017 న అఫిషియల్ గెజిట్ లో పబ్లిష్ చేసిన ‘ప్రివెంషెణ్ అఫ్ మనీ లాండరింగ్ (మైంటేనేన్స్ అఫ్ రికార్డ్స్) సెకండ్ అమెండ్మెంట్ రూల్స్, 2017’ ప్రకారం, కొన్ని వర్తించదగిన కేసులలో, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ విధిగా (మేన్దేటరీ) చేయాలని రిజర్వు బ్యాంక్ వివరించింది. ఈ రూల్స్ శాసనీయం కావడంవల్ల, బ్యాంకులు తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురుచూడకుండా వాటిని అమలుపరచాలి. జోస్ జె. కట్టూర్ ప్రెస్ రిలీజ్: 2017-2018/1089 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?