<font face="mangal" size="3px">గోకుల్ కో -ఆప‌రేటివ్ అర్బ‌న్ బ్యాంక్ లిమిటెĶ - ఆర్బిఐ - Reserve Bank of India
గోకుల్ కో -ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, సికింద్రాబాద్ కు జారీ చేసిన ఉత్తరువులను ఏప్రిల్ 04, 2017 వరకు పొడిగించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.
అక్టోబర్ 05, 2016 గోకుల్ కో -ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, సికింద్రాబాద్ కు జారీ చేసిన ఉత్తరువులను ఏప్రిల్ 04, 2017 వరకు పొడిగించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్. ప్రజా ప్రయోజనార్థం గోకుల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, సికింద్రాబాద్ కు జారీ చేసిన ఉత్తరువులను మరో ఆరు నెలల పాటు పొడిగించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందింది. తదనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35A, సబ్ సెక్షన్ (1) ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి గోకుల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, సికింద్రాబాద్ కు ఏప్రిల్ 04, 2016న వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుంచి జారీ చేసిన ఉత్తరువులు ఏప్రిల్ 04, 2017 వ్యాపార లావాదేవీలు ముగిసే వరకు కొనసాగుతాయని ప్రకటించడమైనది. పై ఉత్తరువులు సమీక్షకు లోబడి ఉంటాయి. పైన పేర్కొన్న ఉత్తరువులోని ఇతర నియమ నిబంధనలలో ఎలాంటి మార్పు ఉండదు. సెప్టెంబర్ 30, 2016న జారీ చేసిన ఆ ఉత్తరువుల కాపీని ఆసక్తి కలిగిన ప్రజల పరిశీలనార్థం బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్ : 2016-17/865 |